Chandrababu Tweet On FDI Rankings: ఎఫ్‌డీఐలో ఏపీ ర్యాంకు క్షీణించటం దురదృష్టకరం: చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2023, 7:41 PM IST

thumbnail

TDP Chief Chandrababu Tweet On FDI Rankings: విదేశీ పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు క్షీణించటంపై.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమాల వేదికగా విచారం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దేశంలోనే ప్రముఖ పోటీదారుగా ఉన్న ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు ఎఫ్‌డీఐ ర్యాంకింగ్స్‌కు దూరమవ్వడం చాలా బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వ విజయాలను కొనసాగించలేక పోయిందని మండిపడ్డారు. 

''ఎఫ్‌డీఐలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు క్షీణించటం దురదృష్టకరం. ఒకప్పుడు టీడీపీ ఆధ్వర్యంలో దేశంలోని ప్రముఖ రాష్ట్రాలలో ఏపీ పోటీదారుగా ఉండేది. ఇప్పుడు ఎఫ్‌డీఐ ర్యాంకింగ్స్‌కు దూరంగా ఉంది. అందుకు కారణం.. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన. టీడీపీ హయంలో పెట్టిన పెట్టుబడులను వైసీపీ కొనసాగించడంలో విఫలమైంది. వాటిలో కొన్ని 2021-22 వరకు కొనసాగాయి. వైసీపీ ప్రభుత్వం భవిష్యత్తు పెట్టుబడిదారులను రాకుండా చేయటమే కాకుండా, ఇప్పటికే ఉన్నవారిని వేరే చోట పెట్టుబడి పెట్టమని బలవంతం చేసింది. జగన్ చర్యలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై హానికరమైన ప్రభావాన్ని చూపాయి. ఉద్యోగ అవకాశాలలో భారీ నష్టాన్ని మిగిల్చాయి'' అని చంద్రబాబు నాయుడు ట్విటర్​లో ఓ వీడియోను విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.