'నేటికీ 33శాతం మంది ఓట్లు వేయడం లేదు - పోలింగ్ శాతం తగ్గితే ఓటు బ్యాంకు రాజకీయాలు'
CBI EX JD Lakshminarayana on Errors in Voter List: ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ప్రక్షాళన చేస్తేనే ఓటింగ్ సక్రమంగా జరిగినట్లు భావించాలని సీబీఐ మాజీ జేడీ వీ.వీ.లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటరు జాబితాలో తప్పొప్పుల గురించి అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేయటం కాకుండా వాటి ప్రక్షాళనలో పాల్పంచుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటరు చైతన్యం కోసం యువ ఓటర్ల నమోదు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వీ.వీ. లక్ష్మీనారాయణ ఈటీవీ భారత్కు వివరించారు.
"ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ప్రక్షాళన చేస్తేనే ఓటింగ్ సక్రమంగా జరినట్లు భావించాలి. ఓటరు జాబితాలో తప్పొప్పుల గురించి అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేయటం కంటే వాటి ప్రక్షాళనలో పాలు పంచుకోవాలి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటరు చైతన్యం కోసం యువ ఓటర్ల నమోదు కోసం ప్రయత్నాలు చేస్తున్నాం." - వీ.వీ.లక్ష్మీనారాయణ, సీబీఐ మాజీ జేడీ