Organ donation: తనువు చాలించి.. ముగ్గురికి ప్రాణదాతగా నిలిచిన యువకుడు

By

Published : May 10, 2023, 8:17 PM IST

thumbnail

Brain dead person donates organs: విజయవాడ సింగ్ నగర్​కి చెందిన శ్రీరాములు తాను చనిపోతూ మరో ముగ్గురి ప్రాణాలను కాపాడాడు. విజయవాడలో సెంట్రింగ్ పని చేస్తుండగా అనుకోకుండా కింద పడిపోయాడు. ఈ ఘటనలో శ్రీరాములు తలకు గాయం కావడంతో మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. గత ఐదు రోజులుగా వెంటిలేటర్​పై శ్రీరాములుకు చికిత్స అందించారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీరాములు బ్రెయిన్ డెడ్​కి గురయ్యారు. తల్లిదండ్రుల మనస్సు ఇంకా గొప్పది. వైద్యుల సూచనతో శ్రీరాములు కుటుంబ సభ్యులు అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చారు. గర్భశోకాన్ని దిగమింగుకున్న తల్లిదండ్రులు అందుకు సహకరించి ధన్యజీవులు అయ్యారు. శ్రీరాములు కాలేయం, కిడ్నీ మణిపాల్ ఆస్పత్రికి, మరో కిడ్నీని గుంటూరు వేదాంత ఆస్పత్రికి తరలించారు. తమ కుమారుడు ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా మరో ముగ్గురి శరీరంలో జీవిస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. మృతదేహానికి మణిపాల్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.