సంక్రాంతి ఉత్సవాలు - రిక్షావాలాగా మారిన బీజేపీ ఎంపీ జీవీఎల్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2024, 4:06 PM IST

thumbnail

BJP MP GVL Narasimha Rao: ఎన్నికలు అంటే రాజకీయ నేతలు చేసే పనులు మాములుగా ఉండవు. ఎక్కడికి వెళ్లినా ఆ పనుల్లో చేయి కలిపి ప్రజల్లో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తారు. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి చిత్రవిచిత్రాలు చూస్తుంటాం. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్​ కూయకముందే కొంతమంది నేతలు సర్కస్ స్టంట్స్ మెుదలెట్టారు. తమకు తోచిన విధంగా, ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటుగా రిక్షా తొక్కారు.

విశాఖలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు కనుమ రోజున రిక్షా తొక్కి సందడి చేశారు. రిక్షావాలాను రిక్షాలో కూర్చోబెట్టుకుని స్వయంగా రిక్షా తొక్కారు. పండగ సందర్భంగా రిక్షా తొక్కిన జీవీఎల్, ప్రజలందరినీ ఆకర్షించే ప్రయత్నం చేశారు.  విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నాలుగు రోజులుగా సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగాయి. చివరి రోజు కనుమనాడు కూడా ఇవి కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా శ్రమైక జీవి, కనుమరుగైపోతున్న వాహనం రిక్షాపై ఇంకా అధారపడి జీవిస్తున్నవారి సేవలను స్మరిస్తూ, ఎంపీ జీవీఎల్ ఈరకంగా సందడి చేశారు. చివర్లో రిక్షా కార్మికునికి కొంత సొమ్మును కూడా అందించారు. ఎంపీ రిక్షా తొక్కిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.