BJP BC Social Consciousness Council: ఏపీలో స్వశక్తితో ఎదగాలని కోరుకుంటున్నాం: లక్ష్మణ్

By

Published : Jun 17, 2023, 1:50 PM IST

thumbnail

BJP BC Social Consciousness Council: నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని రిక్రియేషన్ క్లబ్ మైదానంలో బీసీ సామాజిక చైతన్య సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎల్ లక్ష్మణ్,  బీజేపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎల్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీసీలందరూ ఆలోచించి.. రాష్ట్రంలో మోదీ ప్రభుత్వం కావాలా..?జగన్ ప్రభుత్వం కావాలా..? అనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 50 శాతం జనాభా బీసీలది.. మొసలి కన్నీరు కార్చి బీసీల ఓట్లతో జగన్ సీఎం అయ్యారని ఆయన అన్నారు. బీసీల ఓట్లు వారికే వేసుకుంటే సీఎం పీఠం కదిలిపోతుందంటూ.. ఖబర్దార్ జగన్ మోహన్ రెడ్డి అని ఆయన ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో బీజెపీతో కలిసి రావాలని, బీసీలను ఆదుకుంటామని ఆయన అన్నారు. దీంతోపాటు ఏపీలో స్వశక్తితో ఎదగాలని కోరుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్​లో జనసేనతో పొత్తు ఉందన్న ఆయన.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. తెలుగు ముఖ్యమంత్రులు బీసీల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. సోము వీర్రాజు మాట్లాడుతూ.. దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశం వైపు చూస్తున్నాయి. దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు నరేంద్ర మోదీనే అని అన్నారు. మోదీకు ప్రధాని అయ్యే అవకాశం బీజేపీ కల్పించిందని తెలిపారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.