Gadapa Program: ఎమ్మెల్యే మొండితోకకు నిరసన సెగ.. ప్రశ్నలతో ముంచెత్తిన ప్రజలు

By

Published : May 4, 2023, 4:22 PM IST

thumbnail

Gadapa Gadapa Program: ఎన్టీఆర్ జిల్లాలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్​రావుకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది. ప్రజా సమస్యలపై స్థానికులు.. ఆయనను నేరుగా నిలదీస్తున్నారు. ఇటీవల కూడా పలు గ్రామాల్లోని ప్రజలు కూడా తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. గురువారం వీరులపాడు మండలం చట్టన్నవరం గ్రామంలో గడప గడప కార్యక్రమంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యేకు మరోసారి చేదు అనుభవం ఎదురయింది. 

చట్నవరం గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ సమస్యపై ఓ గ్రామస్థుడు ప్రశ్నించారు. గ్రామంలో తాగునీటి ట్యాంకు నిర్మాణం చేయలేదని, కుళాయిలు ఏర్పాటు కూడా చేయలేదని అన్నారు. డ్రైనేజీలు నిర్మాణం చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. దీంతోపాటు మంచినీటి కుళాయిలు అందరికీ కాకుండా కొందరికే వేస్తున్నారని మహిళలు వాపోయారు. కాగా.. ఈ సమస్యపై మీరు ఎవరికైనా ఫిర్యాదు చేశారా? ఇప్పటి వరకు ఎవరికైనా చెప్పారా? అంటూ ఎమ్మెల్యే ఎదురు ప్రశ్నలు వేశారు. దీనిపై తాము ప్రతి గ్రామ సభలోను ఫిర్యాదు చేస్తున్నామని, అయితే ఈ అంశాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదని స్థానికులు వాపోయారు. అయితే ఎమ్మెల్యేను స్థానికులు ప్రశ్నిస్తున్న సమయంలో వీడియో తీస్తుంటే ఎమ్మెల్యే.. పోలీసుల చేత వీడియోను డిలీట్ చేయించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.