సినిమా గ్రాఫిక్స్​ను తలదన్నే ప్రకృతి అందాలు - అల్లూరి జిల్లాలో మంచుకొండలు చూస్తే 'వావ్' అనాల్సిందే!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 2:55 PM IST

thumbnail

Beauty of Vanjangi Hills in Alluri District : అల్లూరి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి.. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. వంజంగి కొండలపై శ్వేతవర్ణ సోయగాలు ఆకట్టుకుంటున్నాయి. ఉదయభానుడి లేలేత కిరణాలు తాకినవేళ.. వెండిమబ్బుల అందాలు చూపరులను మరో ప్రపంచంలోకి తీసుకెళుతున్నాయి. ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రకృతి రమణీయ దృశ్యాలకు వంజంగి కొండలు కేరాఫ్​ అడ్రస్​గా నిలవడమే కాకుండా.. అక్కడ ఉన్న సహజసిద్ధమైన అందాలను ఆస్వాదిస్తూ ప్రకృతి ప్రేమికులు మైమరిచిపోతున్నారు. రాత్రివేళలో చంద్రుడి వెన్నెల కాంతి, తెల్లవారుజామున సూర్యోదయం.. ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.

వంజంగి కొండపై సుర్యోదయపు వేళలో మంచు అందాలు ఊహాతీతంగా ఉన్నాయి. శ్వేతమయమైనటువంటి కైలాస శిఖరాన్ని ఇనుమడింపజేస్తోంది. వేకువ జామున నుంచి పది గంటల వరకు ఏజెన్సీ ప్రాంతంలో పొగ మంచు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఘాట్ రోడ్​లో ప్రయాణం చేస్తూ.. ప్రకృతి ఇచ్చే స్వచ్చమైన గాలిని ఆస్వాదిస్తూ అలా కొద్దిసేపు ఆ కొండల్లో ప్రకృతి ప్రేమికులు సేద తీరుతున్నారు. అటు వైపుగా వెళ్లిన వారు తమ సెల్ ఫోన్లో ప్రకృతి అందాలను బంధిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.