Chilli Bags Burnt in the Fire: విద్యుత్ తీగలు తగిలి.. మిర్చి లోడ్ లారీలో మంటలు
Published: May 16, 2023, 5:31 PM

Bags Of Chillies Were Burnt In The Fire In Guntur: రైతు ఎంతో కష్టపడి పండించిన మిర్చి పంట అగ్నికి ఆహుతైంది. పండించిన మిర్చిని మార్కెట్కు లారీలో తరలిస్తున్న క్రమంలో అనుకోకుండా ప్రమాదం సంభవించింది. అది గ్రహించిన స్థానికులు ఆ ప్రమాదం తీవ్రం కాకుండా తగు చర్యలు చేపట్టారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది.. అలాగే కొంత మేర మిర్చి బస్తాలు మంటల్లో కాలిపోవడంతో కొంత నష్టం వాటిల్లింది.
మిర్చిలోడ్తో వెళ్తున్న లారీకి విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగిన ఘటన గుంటూరులో జరిగింది. దీంతో మిర్చి లోడ్ లారీలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక ఆటోనగర్ వద్ద మిర్చిలోడ్తో వెళ్తున్న లారీకి అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తగిలాయి. దీని కారణంగా లారీలోంచి మంటలు చెలరేగాయి. ఇది చూసి అప్రమత్తమైన స్థానికులు చాకచక్యంగా లారీలోని కొన్ని బస్తాలను కిందకు లాగేశారు. స్థానికులు లారీలోంచి బస్తాలను లాగేయటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. అనంతరం మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.