Ashada Sare Program in Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఆషాఢ పవిత్రసారె కార్యక్రమం.. భక్తుల నుంచి విశేష స్పందన..

By

Published : Jun 22, 2023, 9:53 AM IST

thumbnail

Good response to Ashada Sare program: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న అమ్మవారికి ఆషాఢ పవిత్రసారె కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. చిట్టినగర్‌లోని కనకదుర్గ లలితా పారాయణ బృందం మహిళలతో పాటు సీతారామస్వామి, మహలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ మహిళలు.. సుమారు ఏడు వందల మంది అమ్మవారి సేవలో పాల్గొనేందుకు దుర్గమ్మ సన్నిధికి వచ్చారు. కోలాటాలు, డప్పువాయిద్యాల నడుమ అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజుల్ని సమర్పించారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసిన మహిళా బృందాలకు.. ఆలయ పాలకమండలి అధ్యక్షులు కర్నాటి రాంబాబు, ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. మహామండపం ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేసి.. అమ్మవారి దర్శనం కల్పించారు. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమం జూన్ 19న ఘనంగా ప్రారంభమైంది. వచ్చే నెల 17వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.