ఆళ్లగడ్డలో 'రా కదిలి రా' కార్యక్రమానికి సర్వం సిద్ధం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2024, 10:13 PM IST

thumbnail

Arrangements for TDP Ra Kadali Ra program: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు తలపెట్టిన రా కదలి రా కార్యక్రమానికి ప్రజల నుంచి మచి స్పందన వస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు.ఈ నేపథ్యంలో  నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంగళవారం జరిగే రా కదలిరా బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది.  చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆళ్లగడ్డ పట్టణానికి హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సమావేశంలో దాదాపు లక్ష మంది పాల్గొంటారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఇప్పటికే భూమా అఖిలప్రియ సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పకడ్బందీగా సభ జరిగేలా  ప్రణాళిక రచించారు. మెుత్తం 90 నిమిషాల పాటు ఈ సమావేశం జరగనుంది. చంద్రబాబుతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆళ్లగడ్డకు రానున్నారు. చంద్రబాబు రానున్న దృష్ట్యా ఆళ్లగడ్డ అంతా పసుపు మయంగా మారింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.