APPSC Group 1 Ranker Satya keerthi Interview: ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా.. పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2023, 7:58 PM IST

thumbnail

Appsc Group 1 Satya keerthi Interview : డాక్టర్‌ అవ్వాలనేది ఆమె కల.. కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఆ ఆలోచన ప్రయత్నాలకే పరిమితం అయ్యింది. అయితేనేం మరోప్రయత్నంగా సివిల్స్‌, గ్రూప్స్‌లను లక్ష్యంగా ఎంచుకుంది అనకాపల్లి జిల్లాకు చెందిన సత్య కీర్తి. ఇటీవల విడుదలైన గ్రూప్‌-1 ఫలితాల్లో మెడికల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైంది.

సత్య కీర్తి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ తల్లి కష్టపడి కీర్తిని చదివించింది. స్కాలర్​షిప్​ సాయంతో కీర్తి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఐటీడీఏ(ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) అధికారులు ఏకలవ్య పేరుతో ఇచ్చిన ఉచిత కోచింగ్‌ సెంటర్లో ప్రతిభను పెంపొందించుకుంది. ఇటీవల వెల్లడైన గ్రూప్‌-1 ఫలితాల్లో మెడికల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైంది . మరి, ఉద్యోగం సాధించడానికి తను అనుసరించిన ప్రణాళిక ఎంటి..? ఈ ఉద్యోగంతో డాక్టర్‌ అవ్వాలనే తన కోరిక తీరినట్లేనా..? భవిష్యత్‌ కార్యచరణ ఏంటి..? తన మాటల్లోనే తెలుసుకుందాం..

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.