చంద్రబాబు సైకత శిల్పం కేసు - పోలీసుల ఎఫ్​ఐఆర్​ను కొట్టివేసిన హైకోర్టు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 12:28 PM IST

thumbnail

AP High Court Dismissed Chandrababu Sand Art Case : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకత శిల్పం కేసును హైకోర్టు కొట్టి వేసింది. చంద్రబాబు అరెస్ట్‌ను (Chandrababu Arrest) నిరసిస్తూ కొత్త ఓడరేవు సమీపంలో సముద్ర తీరం వెంబడి 'ఉయ్‌ ఆర్‌ విత్‌ బాబు (We Are With Babu)' శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేశారని బాపట్ల మండలం అడవి-1 గ్రామానికి చెందిన వీఆర్‌వో  కరీముల్లా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Chandrababu Sand Art Case on Tdp Leaders : వీఆర్ఓ కరీముల్లా ఫిర్యాదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ్‌ మరికొందరు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇందులో భాగంగా పిటిషనర్‌ తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. అనంతరం నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి ప్రతాప్ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని బాపట్ల గ్రామీణ పోలీసులు పిటిషనర్లపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.