Janasena Vs Mudragada: 'మీ కార్యకర్తలు, అభిమానులు బెదిరిస్తున్నారు'.. పవన్ కల్యాణ్‌కు ముద్రగడ మరో లేఖ

By

Published : Jun 23, 2023, 5:12 PM IST

thumbnail

Mudragada padmanabham letter to pawan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖల మీద లేఖలు రాస్తూనే ఉన్నారు. ఇటీవలే పవన్‌ కల్యాణ్‌కు లేఖ రాసిన ముద్రగడ.. నేడు మరోసారి మూడు పేజీల లేఖను రాశారు. ఆ లేఖలో పలు కీలక విషయాలను ప్రస్తావించిన ముద్రగడ.. వచ్చే ఎన్నికల్లో.. 'నన్ను మీ మీద పోటీ చేయడానికి నాకు సవాలు విసరండి' అంటూ సవాలు విసిరారు.  

పవన్‌కు ముద్రగడ మరో లేఖ.. పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈరోజు మరో లేఖ రాశారు. ఆ లేఖలో కాకినాడ నుంచి పోటీ చేయడానికి పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఒకవేళ తోక ముడిస్తే పిఠాపురం నుంచి పోటీ చేయడానికి తమరు (పవన్) నిర్ణయం తీసుకుని.. 'నన్ను మీ మీద పోటీ చేయడానికి నాకు సవాలు విసరండి' అని అన్నారు. అనంతరం 'మీరు, మీ జనసైనికులు నన్ను తిట్టి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషం. మీ బెదిరింపులకు భయపడి నేను లొంగను. గోచి మొలత్రాడు లేని వారితో నన్ను తిట్టిస్తున్నారు. దమ్ముంటే మీరు నన్ను డైరెక్ట్‌గా తిట్టండి.. నేను మీ బానిసను కాదు.. మీ మోచేతి కింద నీళ్లు తాగడం లేదు.. మీ అభిమానులు నాకు బండ బూతులు తిడితూ, మెసెజ్​లు పెడుతున్నారు. మీరు సినిమాలో హీరో తప్పా.. రాజకీయాల్లో కాదు. నన్ను తిట్టాల్సిన అవసరం మీకు, మీ అభిమానులకు ఎందుకొచ్చింది.. నీ వద్ద నేను నౌకరిగా పని చేయడం లేదు కదా..?'' అని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు.    

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.