AP Anganwadi Workers Demands సెప్టెంబర్ 25న మహాధర్నాకు పిలుపు ఇచ్చిన అంగన్వాడీ వర్కర్స్,హెల్పర్స్ యూనియన్ల

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2023, 5:00 PM IST

thumbnail

AP Anganwadi Workers Demands: అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై రాష్ట్రంలోని మూడు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ల అధ్వర్యంలో సెప్టెంబర్ 25వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి కే.సుబ్బరావమ్మ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్​లో జరుగబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. అంగన్వాడీ వర్కర్స్, మినీ వర్కర్స్, హెల్పర్స్.. అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి కనీస వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎఫ్​ఆర్ఎస్ ఫేస్ రికగ్నైజ్డ్ యాప్​తో పాటు వివిధ రకాల యాప్​లను రద్దు చేసి.. ఒకే యాప్ ద్వారా విధులు నిర్వహించే విధంగా చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆఖరి వేతనంలో 50% పెన్షన్​గా ఇవ్వాలని, తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఐక్య కార్యాచరణలోని పై మూడు సంఘాలు ఉద్యమానికి పిలుపు నిస్తున్నాయన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.