జగనన్న'ఏసీలో నువ్వు ఉన్నావు' 'రోడ్డు మీద మేము ఉన్నాం': అంగన్వాడీలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 11:57 AM IST

thumbnail

Anganwadis Protest in Resolution of Problems: తమకు కనీస వేతనంతో పాటు గ్రాట్యుటీని అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంగన్వాడీలు లేఖలు రాశారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుంటూరులో 17వ రోజు వినూత్న నిరసన చేపట్టారు. సమ్మెలో సీఎం జగన్ చిత్రపటం పట్టుకొని పాటలు పాడుతూ నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట దీక్షా శిబిరంలో అంగన్వాడీలు సీఎం జగన్​కు రాసిన ఉత్తరాలను చూపుతూ ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జగన్ ఎన్నికలలో ఇచ్చిన హామీలు, ప్రస్తుతం వాటి అమలు తీరు అంగన్వాడీల ప్రస్తుత స్థితిగతులను తెలుపుతూ పాటలు పాడారు. 

పలువురు అంగన్వాడీలు సీఎం చిత్రపటం చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొట్టారు. అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం ఇస్తున్న ఏకరూప చీరలు నాణ్యమైనవి ఇవ్వాలని నినాదాలు చేశారు. గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్న పోషకాహార కిట్లలో నాణ్యతతో కూడిన వస్తువులు ఉండేలా చూడాలని కోరారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని అంగన్వాడీలు మరోసారి స్పష్టం చేశారు. అంగన్వాడీలు సమ్మెను విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర మంత్రులు కోరుతున్నారు. తమకు కనీస వేతనం, గ్రాట్యుటీని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.