Municipal Outsourcing Workers Problems: "మున్సిపల్​ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్త ఉద్యమం"

By

Published : Jun 23, 2023, 7:31 PM IST

thumbnail

Andhra Pradesh Municipal Outsourcing Workers Problems: మున్సిపల్​ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని.. ఏపీ మున్సిపల్​ వర్కర్స్​ అండ్​ ఎంప్లాయిస్​ ఫెడరేషన్​ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. కార్మికుల సమస్యలపై జూలై నెలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్​, జిల్లా కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇదే కాకుండా ఈ నెల చివరి వారం నుంచి అగస్టు వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్​ కార్మికులను రెగ్యులర్​ చేస్తానన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం తాజాగా కేవలం కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులర్​ చేస్తానని ప్రకటించిందని..  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను జగన్​మోహన్​ అధికారం చేపట్టి ముఖ్యమంత్రైన తర్వాత విస్మరించారని మండిపడ్డారు. సమానపనికి సమానవేతనమని అప్పుడు అని.. ఇప్పుడు ఔట్​ సోర్సింగ్​ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. అప్పుడు మాట తప్పను.. మడమ తిప్పను అని ఇచ్చిన హామీలను.. ఇప్పుడు నేరవేర్చటం లేదని విమర్శించారు. ఔట్​ సోర్సింగ్ కార్మికులకు న్యాయం చేయాలని.. వారిని కూడా రెగ్యులరైజ్​ చేయాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.