రైతుల సొమ్మును జగన్ బంధువులు కాజేయడానికే స్మార్ట్​ మీటర్ల పథకం- అఖిలభారత కిసాన్ సభ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 9:10 PM IST

thumbnail

AIKS Opposes Installation of Smart Meters for Agricultural Motors: ​వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అఖిల భారత కిసాన్ సభ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య స్పష్టం చేశారు. రెండో రోజు ఏఐకేఎస్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా రైతులు వినియోగిస్తున్న విద్యుత్ గురించి ప్రభుత్వానికి తెలుసని ఒక్కో మీటర్​పై 30 వేలకు పైగా వెచ్చించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పంటల భీమా పథకం ద్వారా 14 కార్పొరేట్ కంపెనీలు లబ్ధి పొందుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా మీటర్​పై వెచ్చించే సొమ్ము అంతా కూడా సీఎం జగన్ బంధువుల కాజేయడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 40 లక్షల పాడి రైతులు ఉన్నారని ఒక్కో లీటర్​కు 4 రూపాయలు బోనస్ ఇస్తానన్న హామీ ఇంతవరకు అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను కౌన్సిల్ వ్యతిరేకిస్తున్నట్లు కృష్ణయ్య వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.