Advocate SRP on Chandrababu Cash, Fiber Grid Petitions: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్యాష్, ఫైబర్ నెట్ పిటిషన్ల విచారణపై న్యాయవాది సుంకర వ్యాఖ్యలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 8:50 PM IST

thumbnail

Advocate SRP on Chandrababu Cash, fiber Grid Petitions: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌ నెట్‌ కేసులకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఇరువైపులా న్యాయవాదులు వాడివేడిగా వాదనలు వినిపించారు. న్యాయవాదుల వాదోపవాదాలను విన్న జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. 

ఈ క్రమంలో చంద్రబాబు పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇరుపక్షాల న్యాయవాదులు ఏయే అంశాలపై వాదనలు వినిపించారు..? చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై ధర్మాసనం లేవనెత్తిన అంశాలు ఏంటి..? ఏ అంశాలపై సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు..? మంగళవారం బెయిల్ పిటిషన్లపై ఎలాంటి తీర్పు వెలువడనుంది..? అనే తదితర అంశాలపై హైకోర్ట్ సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ ఈటీవీ భారత్‌తో ముఖాముఖిగా మాట్లాడారు. ఆ విషయాలెంటో ఈ వీడియోను చూసి మీరు కూడా తెలుకోండి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.