Advocate Lakshmi Narayana About Chandrababu Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణలో.. ప్రభుత్వానిది పొంతన లేని వాదన: అడ్వకేట్ లక్ష్మీనారాయణ
Advocate Lakshmi Narayana About Chandrababu Case:చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ వ్యవహరించిన తీరును హైకోర్టులో వాదనల సమయంలో వినిపించామని సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. గవర్నర్ అనుమతి లేకుండా ఆయన్ని అదుపులోకి తీసుకోవడాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వం తరఫు వాదనల్లో ఒకదానికొకటి పొంతన లేదని చెప్పారు. ఈ కేసులో సెక్షన్ 17ఏ అనేది కచ్చితంగా వర్తిస్తుంది అని పేర్కొనడం జరిగిందని తెలిపారు. అదే విధంగా చంద్రబాబు అరెస్టుకు తప్పకుండా గవర్నర్ అనుమతి తీసుకోవాలని ఆయన అన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారని.. నడుస్తున్నాయని పేర్కొన్నారు. అదే విధంగా హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీ లేవనెత్తిన పలు అంశాలను సైతం లక్ష్మీనారాయణ పంచుకున్నారు. నేడు హైకోర్టులో విచారణ ఏ విధంగా జరిగింది, చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనలు జరిగిన తీరుపై పలు కీలక విషయాలను న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ విషయాలు ఏంటి, ఇంతకీ కేసులో ప్రధానంగా ఏ విషయాలపై చర్చ జరిగింది అనేది ఆయన మాటల్లోనే విందాం.