Adivasi JAC leaders: ఎమ్మెల్సీ అనంతబాబు సభను అడ్డుకుంటాం: ఆదివాసీ జేఏసీ నాయకులు
Published: May 22, 2023, 10:11 PM

Ananta Babu party meeting in Rampachodavaram: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో హత్య కేసులోని నిందితుడైన ఎమ్మెల్సీ అనంత బాబు పార్టీ సమావేశం ఎలా నిర్వహిస్తారని.. దీనిని అడ్డుకుంటామని ఆదివాసీ జేఏసీ నాయకులు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం ఏఎస్పీ జగదీష్‌ను కలిసి ఆదివాసీ జేఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు. హత్య కేసులో నిందితుడైన అనంత బాబు పార్టీ సమావేశం ఎలా పెడతారని.. ఈ సభను ప్రభుత్వ ఆసుపత్రి.. సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిలో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారని.. దీనిని రద్దు చేయాలని అన్నారు. పార్టీ సమావేశానికి వెలుగు సిబ్బందిని, ఏఎన్ఎంలను, ఆశావర్కర్లను, సచివాలయ ఉద్యోగులను తీసుకురావాలని అధికారులను అనంతబాబు ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు. అనంత బాబు నిర్వహించే సభకు ఎవరూ రావద్దని 24న బంద్ నిర్వహిస్తున్నామని ఆదివాసీ నాయకులు పిలుపునిచ్చారు. ఏఎస్పీని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కోసూరి సత్యనారాయణ రెడ్డి, ఆదివాసీ జేఏసీ నాయకులు కంగల శ్రీనివాస్, టీడీపీ మండల అధ్యక్షుడు కారం సురేష్, జేఏసీ నాయకులు సోల్ల బొజ్జి రెడ్డి, వీరపురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.