సీఎం జగన్ సోమరితనం వల్లే గుండ్లకమ్మ గేట్లు ఊడి- నీరు వృథా అవుతుంది: అచ్చెన్నాయుడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 2:03 PM IST

thumbnail

Achchennaidu on Gundlakamma Project Gates: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, నిర్లక్ష్యంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్ గాలికొదిలేశారని ఆయన దుయ్యబట్టారు. జగన్ సోమరితనం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు ఊడిపోయి, నీరు వృథా అవుతుందని ధ్వజమెత్తారు.

Achchennaidu Comments: ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబులరెడ్డి జలాశయం (గుండ్లకమ్మ రిజర్వాయర్‌)కు చెందిన రెండో గేటు అడుగు భాగం ఉడిపోయి, నీరు వృథా కావడంపై అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. అందుకు నిదర్శనం గుండ్లకమ్మ గేట్లు ఊడి, నీరు వృథాకావడమే. జగన్ సోమరితనం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌కు ఈరోజు ఈ దుస్థితికి వచ్చింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా మాపై నిందలు వేస్తున్నారు. టీఎంసీ-క్యూసెక్కుకు తేడా ఏంటో తెలియని వారికి నీటిపారుదల శాఖ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మారకపోతే, ప్రాజెక్టుల వద్ద పెద్దఎత్తున ఆందోళనలు చేస్తాం.'' అని అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.