ఓటరు ప్రయాణికుల కష్టాలపై ఆర్టీసీ స్పందన ఇదే! - APSRTC OFFICIALS ON BUS SHORTAGE

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 8:20 PM IST

thumbnail
ప్రయాణికుల కష్టాలపై స్పందించిన ఆర్టీసీ - 40 మందికి మించి ఎక్కువ ఉంటే ప్రత్యేక బస్సును బుక్ చేసుకోవచ్చు (ETV Bharat)

APSRTC Arranged Special Buses for Andhra Pradesh Voters : ఓటు వేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారు పడుతోన్న కష్టాలపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. ఎన్నికల నిమిత్తం వచ్చే వారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు ప్రత్యేక బస్సులను ముందుగానే బుకింగ్ చేసుకునే ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 40 లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు కలసి ఒకే ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ఆర్టీసీ బస్​ను ప్రత్యేకంగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. దీనికోసం 99591 11281 నెంబర్​ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే విజయవాడ ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఎలెక్షన్ సెల్​ను ప్రారంభించినట్లు తిరుమలరావు వివరించారు. 

ప్రత్యేక ఎలక్షన్ సెల్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. సోమవారం పోలింగ్ జరగనున్న దృష్ట్యా ఎన్నికల సిబ్బంది, సహా సామాగ్రి రవాణా కోసం ఆయా జిల్లాల నుంచి ఎన్నికల అధికారులకు 5458 బస్సులను ఏపీఎస్​ఆర్టీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే వారి కోసం మే 8 నుంచి 12 వరకు హైదరాబాద్ నుంచి 1066 , బెంగళూరు నుంచి 284 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.