Kuppam young man cycle tour for Chandrababu చంద్రబాబుకు మద్దతుగా కుప్పం యువకుడి సాహస సైకిల్ యాత్ర.. అభినందించిన భువనేశ్వరి, బ్రాహ్మణి
A young man cycle trip in support to Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా.. టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు... వివిధ రూపాలలో రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతూ మద్ధతు తెలుపుతున్నారు. తాజాగా కుప్పం మండలానికి చెందిన గణపతి అనే యువకుడు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ, రాజమహేంద్రవరం వద్దకు వచ్చాడు. ఎనిమిది రోజుల క్రితం స్వగ్రామం కనమపచ్చర్లపల్లె నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించినట్లు తెలిపాడు. కుప్పం నియోజకవర్గం కనమపచ్చర్లపల్లి నుంచి 724 కి.మీ మేర సైకిల్ యాత్ర చేపట్టిన గణపతి.. ఈ రోజు మధ్యాహ్నానికి రాజమహేంద్రవరం చేరుకున్నాడు.
అనంతరం రాజమండ్రిలో చంద్రబాబు కుటుంబసభ్యులను కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అభిమానికి భువనేశ్వరి, బ్రాహ్మణి కృతజ్ఞతలు చెప్పారు. కుప్పాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబే అని.. ఆయనను అరెస్టు చేయడం అన్యాయమని గణపతి భావోద్వేగానికి గురయ్యాడు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందని ఎదురుచూపుతో సైకిల్ యాత్ర చేశానని తెలిపాడు. చంద్రబాబుకు బెయిల్ రాకపోవడం అన్యాయం అంటూ ఆవేదన చెందాడు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం వల్ల రాష్ట్రం నష్టపోతుందని కన్నీటి పర్యంతమయ్యాడు.