శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదం కారులో చెలరేగిన మంటలు

By

Published : Nov 16, 2022, 6:00 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

thumbnail

Car Fire: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు దగ్ధమయ్యింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు డ్రైవర్ అప్రమత్తం కావడంతో.. అతని​తో సహా యాజమాని వెంటనే కారులో నుంచి బయటకు దిగారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో రహదారిపై ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.