ETV Bharat / sukhibhava

అధిక కొలెస్ట్రాల్​తో బాధపడుతున్నారా? - కరివేపాకుతో ఊహించని మార్పు - తేల్చిన రీసెర్చ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 4:45 PM IST

Health Benefits of Curry Leaves : మీరు అధిక కొవ్వుతో బాధపడుతున్నారా? మందుల మీదనే ఆధారపడుతున్నారా? అయితే.. మీకోసమే ఈ స్టోరీ. కరివేపాకు నిత్యం తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్​ తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Health Benefits of Curry Leave
Health Benefits of Curry Leave

Health Benefits of Curry Leaves : ఈ ఆధునిక యుగంలో అందరినోటా వినిపిస్తున్న మాట "ఆరోగ్యం". ఆస్తి ఎంత ముఖ్యమో.. అంతకన్నా ఆరోగ్యం ముఖ్యం అంటున్నారు. అయితే.. దాన్ని ఎలా కాపాడుకోవాలో మాత్రం చాలా మందికి తెలియట్లేదు. అయితే.. ఇంగ్లీష్ మందులతో కాదు.. మనం తినే ఆహారం ద్వారానే హెల్త్ కాపాడుకోవచ్చని చెబుతోంది ఆయుర్వేదం.

కడుపులోకి వెళ్లిన తిండి.. శరీరానికి పోషకాల రూపంలో శక్తినిస్తుంది. కాబట్టి.. మనం తినే తిండి మంచిదైతే ఆరోగ్యం బాగుంటుంది. చెడ్డదైతే దెబ్బ తింటుంది. అందుకే ఏం తింటున్నామన్నదే కీలకం అంటారు ఆయుర్వేద నిపుణులు. ఈ క్రమంలో చెత్తా చెదారం తిని లెక్కాపత్రం లేకుండా పెరిగిన దేహంలో.. ఎక్స్ ట్రా కొలెస్ట్రాల్​ను కరిగించి పర్ఫెక్ట్ షేప్​ లోకి తెచ్చుకోవాలంటే.. కరివేపాకు అస్త్రాన్ని ప్రయోగించాలని చెబుతున్నారు. మరి.. దాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

డిన్నర్​లో ఏం తింటున్నారు..? ఇవి తింటే డేంజర్​ జోన్​లో పడ్డట్టే!

కొవ్వును కరిగించడంలో కరివేపాకు ఎంతగానో సహకరిస్తుందని.. ఆయుర్వేద నిపుణులతోపాటు ఎంతో మంది పరిశోధకులు కూడా స్పష్టం చేశారు. కరివేపాకులో యాంటీ ఒబెసిటీ లక్షణాలు ఉన్నాయట. మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడడంతోపాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా ఇది నివారిస్తుందట. అంతేకాదు.. పెద్ద పేగు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా కరివేపాకు పోరాడుతుందట. ఇందులో ఫినోలిక్ ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. ఈ మేరకు.. Journal of Medicinal Food ఓ అధ్యయనం ప్రచురించింది. అందువల్ల కరివేపాకును మీ ఆహారంలో ప్రతిరోజూ భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా చేయండి..

పచ్చి ఆకులు నమలడం: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని తాజా కరివేపాకులను నోట్లో వేసుకొని నమలొచ్చు. దీనివల్ల మీ శరీరంలో జీవక్రియ మెరుగు పడుతుంది.

వంటల్లో: వంటల్లో కరివేపాకు ప్రాధాన్యం ఏంటో అందరికీ తెలిసిందే. అయితే.. చాలా మంది కరివేపాకు తీసేసి తింటారు. అలా చేయకండి. పూర్తిగా కరివేపాకు తినేయాలి.

కరివేపాకు టీ: కరివేపాకుతో టీ కూడా చేసుకోవచ్చు. అయితే.. ఇది ఉదయాన్నే సేవించేది కాదు. రాత్రివేళ పడుకునే ముందు తీసుకోవాలి. దీనివల్ల బరువు తగ్గే ప్రక్రియ మరింత వేగంవంతం అవుతుందట. ముఖ్యంగా శరీరానికి రెండు వైపులా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుందట.

షుగర్ ఉన్నవారు రాత్రిపూట చపాతీలు తినొచ్చా?

కరివేపాకు టీ ఇలా చేయండి..

  • ముందుగా గిన్నెలో 1 కప్పు నీటిని మరిగించాలి.
  • అందులో 10-12 కరివేపాకులు.. 1 స్పూన్ జీలకర్ర వేయాలి.
  • 5 నిమిషాల వరకు ఉడకబెట్టాలి.
  • ఆ తర్వాత మంటను ఆపేసి.. హాఫ్ స్పూన్ పసుపు వేయాలి.
  • అంతే.. వేడి వేడిగా తాగేయాలి.
  • ఇది కొలెస్ట్రాల్​ను కరిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఎన్నో పోషకాలు..

కరివేపాకు బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా.. మరెన్నో ఇతర పోషకాలను కూడా అందిస్తుంది. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ఖనిజాలతోపాటు A, B, C, E వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

నెలసరి టైమ్​లో కడుపు నొప్పా? వికారంగా ఉంటోందా?.. ఈ టిప్స్ మీ కోసమే!

మీరు ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - మీ పేగుల్లో విషం నింపుతునట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.