ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరం.. ఓటర్లకు టిఫిన్ బాక్స్​లు పంపిణీ

author img

By

Published : Feb 10, 2023, 9:18 PM IST

MLC Elections
ఎమ్మెల్సీ ఎన్నికలు

MLC elections: పశ్చిమ రాయలసీమ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి.. ఓట్ల కోసం టిఫిన్ బాక్స్​లు పంపిణీ చేస్తుండగా విద్యార్థి సంఘ నాయకులు పట్టుకున్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. అభ్యర్థులు ఉపాధ్యాయులకు గిఫ్ట్​లు పంచి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

MLC elections: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి.. పాఠశాలలలో ఉపాధ్యాయులకు టిఫిన్ బాక్స్​లు పంచుతుండగా విద్యార్థి సంఘ నాయకులు పట్టుకున్నారు. వాటిని కడప ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్​కు తీసుకొచ్చారు. పోలీసులు టిఫిన్ బాక్స్​ల పంపిణీపై ఆరా తీస్తున్నారు. ఏయే పాఠశాలల్లో ఇప్పటివరకూ పంపిణీ చేశారనేది విచారిస్తున్నారు.

ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉపాధ్యాయులకు టిఫిన్ బాక్స్​లు పంచి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో కూడా రామచంద్రారెడ్డి టిఫిన్ బాక్స్​లు పంచుతుండగా.. అక్కడ కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇలా నజరానాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించడం సరికాదని విద్యార్థి సంఘం నాయకులు అన్నారు. పోలీసులు ఎమ్మెల్సీ అభ్యర్థులపై నిఘా ఉంచాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.