ETV Bharat / state

YS Viveka murder case: జైల్లో శివశంకర్​రెడ్డిని కలిసిన వైకాపా ఎమ్మెల్యేలు

author img

By

Published : Apr 1, 2022, 4:10 AM IST

YS Viveka murder case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్​రెడ్డిని ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు కలిశారు. నిందితుడిగా ఉన్న శివశంకర్​రెడ్డిని ఎమ్మెల్యేలు జైల్లో కలవడం చర్చనీయాంశమైంది.

YS Viveka
YS Viveka

YS Viveka murder case: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న... దేవిరెడ్డి శివశంకర్​రెడ్డిని ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కడప జైల్లో కలిశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఇద్దరు కలిసి...కడప జైల్లో రిమాండ్లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్​ రెడ్డితో ములాకత్ అయ్యారు. అరగంట పాటు అతనితో మాట్లాడారు. ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు శివశంకర్​రెడ్డి భార్య కూడా ఆయనను కలిశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో.. నిందితుడిగా ఉన్న శివశంకర్​రెడ్డిని ఎమ్మెల్యేలు జైల్లో కలవడం చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి: 'వివేకా హత్య కేసులో నన్ను ఇంప్లీడ్‌ చేయండి'.. హైకోర్టులో సునీతా రెడ్డి పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.