ETV Bharat / state

Viveka Murder Case: 'వివేకా హత్య కేసులో నా కుమారుడిని కావాలనే ఇరికించారు'

author img

By

Published : Aug 5, 2021, 8:43 PM IST

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అరెస్టై..కడప కేంద్ర కారాగారంలో రిమాండ్​ ఖైదీగా ఉన్న సునీల్ యాదవ్​ను చూసేందుకు ఇవాళ ఆయన కుటుంబ సభ్యులు జైలు వద్దకు వచ్చారు. సునీల్​ను కలిసేందుకు జైలు అధికారులు వారిని అనుమతించలేదు. తన కుమారుడి ప్రమేయం లేకపోయినా సీబీఐ అధికారులు కావాలనే కేసులో ఇరికించారని సునీల్ యాదవ్ తల్లి సావిత్రి ఆరోపించారు.

viveka murder case suspect sunil yadav parents comments on cbi
'వివేకా హత్య కేసులో నా కుమారుడిని కావాలనే ఇరికించారు'

'వివేకా హత్య కేసులో నా కుమారుడిని కావాలనే ఇరికించారు'

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తన కుమారుడి ప్రమేయం లేకపోయినా సీబీఐ అధికారులు కావాలనే ఇరికించారని సునీల్ యాదవ్ తల్లి సావిత్రి, భార్య లక్ష్మి ఆరోపించారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్​ ఖైదీగా ఉన్న సునీల్ యాదవ్​ను చూసేందుకు ఇవాళ వారు జైలు వద్దకు వచ్చారు. సునీల్​ను కలిసేందుకు జైలు అధికారులు వారిని అనుమతించలేదు.

కావాలనే ఇరికించారు

రెండేళ్ల నుంచి పోలీసులు, సీబీఐ అధికారులు తమ కుటుంబాన్ని చిత్ర హింసలు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్​ను సీబీఐ అధికారులు తీవ్రంగా కొట్టినట్లు ఆరోపిస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోలను మీడియాకు చూపించారు. హత్య కేసు ఒప్పుకోవాలని సునీల్ స్నేహితుడు ఒత్తిడి చేయటంతో గత్యంతరం లేక గోవా పారిపోయాడన్నారు. వైఎస్ కుటుంబం అంటే తమకు ఎనలేని గౌరవం ఉందని.. కొందరు వ్యక్తులు కావాలనే తమ కుమారుడిని ఇరికిస్తున్నారని సావిత్రి వాపోయారు. దస్తగిరి, ఉమా శంకర్ ద్వారానే సునీల్​కు వివేకానందరెడ్డి పరిచయం అయ్యారు కానీ.. హత్య కేసుతో సంబంధం లేదన్నారు. వివేకాను హత్య చేసిందెవరో సీబీఐకి తెలుసునని సునీల్ భార్య లక్ష్మీ ఆరోపించారు.

గోవాలో అరెస్టు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్​ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈనెల 2న గోవాలో సునీల్ యాదవ్​ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ ధ్రువీకరించింది. ఈనెల 3న సునీల్​ను గోవా స్థానిక కోర్టులో హజరుపరిచిన సీబీఐ అధికారులు ట్రాన్సిట్ రిమాండ్​లోకి తీసుకున్నారు.

కొనసాగుతున్న విచారణ

వివేకా హత్య కేసులో 60వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సీబీఐ విచారణకు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, ఉమా శంకర్ రెడ్డి, ఖలందర్ అనే వ్యక్తులు హాజరయ్యారు. సాయంత్రం సీబీఐ బృందం పులివెందుల కోర్టుకు వెళ్లి వచ్చినట్లు సమాచారం.

ఇదీ చదవండి:

viveka murder case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సునీల్‌ యాదవ్‌ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.