ETV Bharat / state

Girls Missing: వసతి గృహం నుంచి ఇద్దరు బాలికలు మిస్సింగ్..ఏమైంది..!

author img

By

Published : Mar 2, 2022, 2:04 PM IST

వసతి గృహంలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. అల్పాహారం సమయంలో 42 మంది విద్యార్థినులు ఉండగా.. భోజన సమయంలో 40మంది ఉండడంతో వారు అదృశ్యమైనట్లు గుర్తించామని హాస్టల్ వార్డెన్ చెప్పారు.

two girls missing from rajampeta bc hostel
two girls missing from rajampeta bc hostel

వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన కడప జిల్లా రాజంపేట బీసీ బాలికల సమీకృత వసతి గృహంలో జరిగింది. వసతి గృహ వార్డెన్ శోభారాణి అందించిన సమాచారం మేరకు.. ఈనెల 1న ఉదయం అల్పాహారం తినే సమయంలో 42 మంది విద్యార్థులు ఉండగా భోజన సమయానికి 40 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని.. ఇద్దరు విద్యార్థినులు తప్పిపోయినట్లు గుర్తించామని హాస్టల్ వార్డెన్ చెప్పారు.

కడపకు చెందిన స్వధార్ సంస్థ 3 నెలల క్రితం ఓ బాలికను వసతి గృహంలో చేర్చిందని తెలిపారు. ఆ బాలికకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో పాఠశాలలో చేర్పించలేదని చెప్పారు. రాజంపేట పట్టణానికి చెందిన మరో బాలిక ఐదో తరగతి చదువుతోందన్నారు. ఘటనపై రాజంపేట ఫిర్యాదు చేశామన్నారు. పిల్లల ఆచూకీ కోసం పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించాలన్నారు.

ఇదీ చదవండి:

AP CRIME NEWS: దిండుతో భార్యను హతమార్చిన భర్త.. కారణమిదే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.