ETV Bharat / state

అధికారులకు వినిపించని అక్రమం.. 'చెవుడు'తో వాలంటీర్ కుటుంబంలో ఏడుగురికి పింఛన్

author img

By

Published : Mar 2, 2023, 5:37 PM IST

Updated : Mar 2, 2023, 6:00 PM IST

Volunteer irregularities : 'వడ్డించేవాడు మనవాడైతే.. బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏం..?' అనే సామెత ఊరికే రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం.. సవాలక్ష నిబంధనలను సాకుగా చూపుతూ పింఛన్ లబ్ధిదారుల్లో అర్హులను సైతం ఏరివేస్తుండగా.. మరోవైపు గ్రామ వాలంటీర్లు బంధుప్రీతి చూపుతున్నారు. కడప జిల్లాలో ఒకే కుటుంబంలో ఏడుగురికి పింఛన్ మంజూరు చేస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Etv Bharat
Etv Bharat

Volunteer irregularities : నెల రోజులు కూడా కాలేదు.. ఆ సంఘటన నేటికీ కళ్లెదుట కదలాడుతూనే ఉంది. గుర్తొచ్చిన ప్రతిసారీ కళ్లు చెమర్చుతూనే ఉన్నాయి. తల తిక్క నిబంధనల కారణంగా ఓ ఆదివాసీ వృద్ధుడు పింఛన్​కు దూరమై ఆకలి చావుతో కన్నుమూశాడు. శ్రీకాకుళం జిల్లా మొళియపుట్టిలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసింది.

గుంటూరు జిల్లాకు చెందిన మరో వృద్ధురాలి పింఛన్ కూడా అధికారులు నిలిపేశారు. కొడుకులు లేక కూతురు ఇంట్లో తలదాచుకోవడమే ఆమెకు శాపంగా మారింది. అల్లుడు కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడనే సాకుతో వృద్ధురాలి పింఛన్ తొలగించారు. దీంతో ఆ వృద్ధురాలు అన్నం తినడం మానేసింది. పై రెండు ఘటనల్లో నిబంధనలు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నామని చెప్పుకుంటున్న అధికారులు.. అస్మదీయులకు అందలం వేస్తున్నారు.

ఒకే కుటుంబంలో ఏడుగురు.. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం సంగుటూరు సచివాలయం పరిధిలో నాగేశ్వర్​ రెడ్డి అనే వాలంటీర్ తన కుటుంబంలో ఏడుగురికి దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయించుకున్న వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. కమలాపురం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు పుత్తా ఎల్లారెడ్డి ఈ విషయాన్ని ఎత్తిచూపాడు. సచివాలయం పరిధిలోని వాలంటీర్ ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి పింఛన్ ఎలా మంజూరు చేయిస్తారంటూ ఎంపీడీవోను నిలదీశారు. మరో బంధువుకు కూడా వికలాంగుల పింఛన్ ఇప్పిస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చాడు.

మరో చోట దరఖాస్తు చేసి... సచివాలయ పరిధిలో మంజూరుకు దరఖాస్తు చేస్తే ఎవరైనా ప్రశ్నించే వీలుంటుంది. అలా కాకుండా కమలాపురంలోని ఓ సచివాలయ పరిధిలో దరఖాస్తు చేసి.. అక్కడి నుండి లాగిన్ చేసి అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. సంగుటూరు సచివాలయం పరిధిలో గతంలో కూడా అవకతవకలు జరిగాయని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదని ఆయన తెలిపారు. అధికారులు కనీసం స్పందించలేదని చెప్పారు. ఇంత జరుగుతున్నా తమకేమీ తెలియనట్లు అధికారులు వ్యవహరించడానికి మామూళ్లే కారణమని ఆయన ఆరోపించారు. దీంతో సభలో గందరగోళం నెలకొనగా.. అధికారులు, ప్రజాప్రతినిధులు అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఎంపీడీవో మాట్లాడుతూ తమ పరిధిలో జరిగే పని తాము చేస్తామని, లేదంటే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూస్తామని చెప్పారు.

అందరికీ చెవుడు అనే సాకుతో.. సంగుటూరు సచివాలయ పరిధిలోని మూల పవన్ కుమార్ రెడ్డి, మూల ఆదిలక్ష్మి, మూల ముఖేష్ రెడ్డి, మూల లక్ష్మీనరసమ్మ, మూల హాసిని, మూల విరా ప్రణీత్ రెడ్డి, మూల కాంతమ్మ.. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరందరికీ చెవుడు ఉన్నట్లు.. డాక్టర్ మహేంద్ర రెడ్డి సర్టిఫికెట్ మంజూరు చేశారు. సామాన్య ప్రజలు ఏవైనా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అధికారులు పలు సాకులు చెప్తుంటారు. కానీ, అనర్హత కలిగిన వారికి ఎలా మంజూరు చేశారో అని పుత్తా ఎల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేదని... అవసరమైతే విజిలెన్స్ అధికారులు దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. సంబంధిత వాలంటీర్ నాగేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు.

చెవిటి పింఛన్ల లబ్ధిదారుల వివరాలివీ..

  • మూల పవన్ కుమార్ రెడ్డి (నాగేశ్వర్ రెడ్డి సోదరుడు) వయసు 47 (చెవుడు) వృత్తి వ్యవసాయం
  • మూల ఆదిలక్ష్మి (34), భర్త పవన్ కుమార్ రెడ్డి (గృహిణి)
  • మూల ముఖేష్ రెడ్డి(10 )తండ్రి పవన్ కుమార్ రెడ్డి
  • మూల లక్ష్మీనరసమ్మ(30) భర్త నాగేశ్వర్ రెడ్డి (గృహిణి)
  • మూల హాసిని(08) తండ్రి నాగేశ్వర్ రెడ్డి
  • మూల ప్రణీత్ రెడ్డి(10) తండ్రి నాగేశ్వర్ రెడ్డి
  • మూల కాంతమ్మ(45) గృహిణి
  • వీరితో పాటు ఇల్లూరు రామచంద్రారెడ్డి(56)కి వికలాంగుల పింఛన్

ఇవీ చదవండి :

Last Updated : Mar 2, 2023, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.