ETV Bharat / state

tdp protest: కడప జిల్లాలో తెదేపా నిరసనలు..

author img

By

Published : Oct 20, 2021, 12:22 PM IST

Updated : Oct 20, 2021, 5:05 PM IST

tdp  protest:
tdp protest:

తెదేపా కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా.. ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా బంద్​(tpd calls state bandh)కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా.. కడప జిల్లాలోనూ తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు.. తెదేపా నేతలు, కార్యకర్తలను ముందస్తుగా గృహ నిర్బంధం(House arrest) చేశారు. పలుచోట్ల రోడ్లపైకి వచ్చిన వారిని అరెస్టు(arrest)చేశారు.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడులను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా బంద్​కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో.. కడప జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. పోలీసులు అడుగడుగునా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్య నేతలను ముందస్తుగా గృహ నిర్బంధం(House arrest) చేశారు.

మైదుకూరులో..
తెదేపా కార్యాలయాలపై దాడులను ఖండిస్తూ.. తితిదే మాజీ ఛైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్​తోపాటు తెదేపా నాయకులు మైదుకూరులోని నాలుగురోడ్ల కూడలి వద్ద రహదారిపై భైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకుని పుట్ట సుధాకర్ యాదవ్​తోపాటు తెదేపా నాయకులను అరెస్టు(arrest) చేశారు.

ప్రొద్దుటూరులో..
తెదేపా కడప పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు లింగారెడ్డిని ప్రొద్దుటూరులో పోలీసులు అరెస్ట్(arrest) చేశారు. బంద్ నిర్వహించేందుకు వెళుతుండగా.. లింగారెడ్డిని పోలీసులు అడ్డుకుని స్టేషన్​కు తరలించారు. మరో నేత ప్రవీణ్ కుమార్ రెడ్డిని గృహనిర్బంధం(House arrest) చేశారు.

పులివెందులలో..
పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జి, ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు గృహనిర్బంధం(House arrest) చేశారు. పార్టీ పిలుపు మేరకు బంద్​లో పాల్గొనడానికి సింహాద్రిపురంలోని ఆయన ఇంటి నుంచి బయటకు వస్తుండగా.. హౌస్ అరెస్ట్ చేశారు. ఖాజీపేటలో తెదేపా నేత రెడ్యం వెంకట సుబ్బారెడ్డిని సైతం పోలీసులు గృహ నిర్బంధం(House arrest) చేశారు.

ఇదీ చదవండి

TDP Nirasana : తెదేపా నిరసన గళం.. పోలీసు అరెస్టుల పర్వం..

Last Updated :Oct 20, 2021, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.