రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు.. పోలీసులపై దాడికి యత్నం

author img

By

Published : Mar 15, 2023, 4:44 PM IST

sandalwood smugglers arrested

Six red sandalwood smugglers arrested: వైయస్సార్ జిల్లా పెండ్లిమర్రి పోలీసులు దాడి చేసి ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. అరెస్టు అయిన స్మగ్లర్ల నుంచి ఏడు లక్షల రూపాయలు విలువ చేసే 19 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. అరెస్ట్ అయిన ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లని కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి ఎదుట హాజరు పరిచారు.

Six red sandalwood smugglers arrested: వైయస్సార్ జిల్లా పెండ్లిమర్రి పోలీసులు దాడులు చేసి ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. అరెస్టు అయిన స్మగ్లర్ల నుంచి ఏడు లక్షల రూపాయలు విలువ చేసే 19 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీన పరచుకున్నారు. అరెస్ట్ అయిన ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లని కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి ఎదుట హాజరు పరిచారు.

పోలీసులపై రాళ్లు, గొడ్డలితో దాడి..: పెండ్లిమర్రి మండలం నంది మండలం గ్రామానికి సమీపంలోని ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలలో ఆరుగురు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకొని వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులపై పోలీసులు దాడులు చేశారు. పట్టుకోడానికి రావడంతో ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులపైనే దాడులు చేసేందుకు ప్రయత్నించారు. స్మగ్లర్లలో ఓ వ్యక్తి పోలీసులపై రాళ్లు, గొడ్డలితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి పోలీసులు చాకచక్యంగా తప్పించుకున్నారు. పోలీసులు సమయస్పూర్తితో వ్యవహరించి తమపై దాడులకు పాల్పడ్డ.. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. స్మగ్లర్ల నుంచి ఏడు లక్షల రూపాయలు విలువ చేసే 19 దుంగలను, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీన పరచుకున్నారు.

అరుదైన సంపద ఎర్రచందనం..: ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని అరుదైన ఎర్రచందనం వైయస్సార్ జిల్లా, చిత్తూరు జిల్లా తిరుపతి తదితర ప్రాంతాలలో పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి అరుదైన సంపదను అంతర్రాష్ట్ర స్మగ్లర్లు యధేచ్చగా అక్రమ రవాణా చేస్తుంటే పోలీసులు నామమాత్రపు దాడులు చేస్తున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఓ చోట ఎర్రచందనం అక్రమ రవాణా అవుతూనే ఉంది. ఎర్రచందనం దుంగలను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. తమిళనాడు నుంచి కూలీలను రప్పించి వారి ద్వారా దుంగలను అక్రమ రవాణా చేస్తున్నారు. ఇటీవల కాలంలోనే అటు అటవీశాఖ అధికారులు, ఇటు పోలీసు శాఖ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ స్మగ్లర్లు ఏమాత్రం భయపడకుండా ఎర్రచందనం అడవుల్లోకి వెళ్లి యథేచ్చగా చెట్లను నరికి వాటిని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు.

అడ్డదారుల్లో ఎర్రచందనం తరలింపు..: పోలీసులు ఎంత నిఘా పెట్టినప్పటికీ ఏదో ఒక మార్గంలో స్మగ్లర్లు అడవుల్లోకి ప్రవేశిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు కడప జిల్లా వ్యాప్తంగా 9 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అలానే పోలీస్ శాఖ వారు కూడా వివిధ ప్రాంతాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నప్పటికీ అడ్డదారుల్లో ఎర్రచందనం దుంగలను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. కేవలం ఎర్రచందనం చెట్లను నరికే కూలీలనే తప్ప బడా స్మగ్లర్లను అరెస్టు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. స్మగ్లర్లు ఆయా ప్రాంతాల్లోని ఎర్రచందనం వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుని వారి ద్వారా కూలీలను అడవుల్లోకి పంపించి ఎర్రచందనాన్ని ధ్వంసం చేస్తున్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధిస్తాం..: పరారీలో ఉన్న మరి కొంతమంది ఎర్రచందనం స్మగ్లర్లను వెతికి పట్టుకోడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు అక్రమ రవాణా చేసి ఎవరికి విక్రయిస్తూరనే విషయాలను దర్యాప్తులో తెలుసుకోనున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. వైయస్సార్ జిల్లా నుంచి ఎర్రచందనం దుంగలను ఏయే రాష్ట్రాలకు తరలిస్తున్నారుతో సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వివరించారు. కడప సబ్ డివిజన్ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడకుండా గట్టి చర్యలు చేపట్టామని ప్రత్యేక బృందాలచే అనునిత్యం నిఘా ఉంచామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు ఛేదించిన పోలీసులను డీఎస్పీ నగదు రివార్డు ఇచ్చి అభినందించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.