ETV Bharat / state

Rail Roko: రైల్​రోకోలో పాల్గొన్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి... కమలాపురం రైల్వేస్టేషన్​లో ఉద్రిక్తత..

author img

By

Published : Jan 10, 2022, 10:27 PM IST

Rail Roko: కమలాపురం రైల్వేస్టేషన్​లో రైళ్లు నిలపక పోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రైల్​రోకో నిర్వహించారు. కమలాపురం-కాజీపేటకు వెళ్లే మార్గంలో రైల్వేగేటు వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో రైలుపట్టాల వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

Rail Roko
Rail Roko

Rail Roko: కడపజిల్లా కమలాపురం రైల్వేస్టేషన్​లో ఏడాది నుంచి రైళ్లు నిలపక పోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రైల్​రోకో నిర్వహించారు. కమలాపురం-కాజీపేటకు వెళ్లే మార్గంలో రైల్వేగేటు వద్ద గంటపాటు బైఠాయించి ధర్నా చేపట్టారు. రైలు పట్టాలపై కూర్చుని రైళ్లు నిలపాలని నినాదాలు చేశారు. కొవిడ్ ముందు వెంకటాద్రి, ముంబాయి-చెన్నై ఎక్స్​ప్రెస్, హరిప్రియ ఇలా అనేక ఎక్స్​ప్రెస్ రైళ్లు కమలాపురం, నందలూరు, కొండాపురం రైల్వేస్టేషన్​లలో నిలిపేవని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కానీ కొవిడ్ తర్వాత ప్రయాణికులు రైళ్లు ఎక్కడం లేదనే కారణంతో.. ఈ రైల్వేస్టేషన్లలో రైళ్లు నిలపడం లేదని అన్నారు.

రైల్వే బోర్డుకు గతంలో విన్నవించినా పట్టించుకోలేదని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. గత్యంతరం లేని స్థితిలోనే ఇవాళ రైల్ రోకో చేయాల్సి వచ్చిందని అన్నారు. రైల్​రోకో చేస్తున్న సమయంలో స్టేషన్ సమీపంలో ముంబాయి-చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నిలిపివేశారు. కమలాపురం రైల్వే స్టేషన్​కు వచ్చి స్టేషన్ మాస్టర్​కు వినతి పత్రం అందజేశారు. వారంలోపు రెండు రైళ్లు కమలాపురం రైల్వేస్టేషన్​లో నిలిపేవిధంగా చర్యలు తీసుకుంటామని.. గుంతకల్లు ఏడీఆర్ఎం హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

ఇదీ చదవండి: నిత్యావసరాల ధరలు తగ్గించాలి.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు చంద్రబాబు పిలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.