నిత్యావసరాల ధరలు తగ్గించాలి.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు చంద్రబాబు పిలుపు

author img

By

Published : Jan 10, 2022, 6:42 PM IST

Chandrababu calls for statewide protests to reduce the prices of essential needs

నిత్యావసరాల ధరలు తగ్గించాలనే డిమాండ్‌తో.. మంగళవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్యనేతలతో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించిన ఆయన “ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి” అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

నిత్యావసరాల ధరలు తగ్గించాలనే డిమాండ్‌తో.. మంగళవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్యనేతలతో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించిన ఆయన “ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి” అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలకు సమాధానం చెప్పలేక.. వైకాపా ఆత్మరక్షణలో పడిందన్నారు.

మైనింగ్ దోపిడీపై పూర్తి స్థాయి పోరాటానికి సిద్ధమవ్వాలని.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి క‌నుస‌న్నల్లోనే రాష్ట్రంలో మైనింగ్ దోపిడీ జరుగుతోందని, తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీని పున‌ః స‌మీక్షించాలని.. గ్రామ, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌ను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వినుకొండ‌లో మ‌ద్దతు ధ‌ర అడిగిన రైతుపై అక్రమ కేసు పెట్టి సంక్రాంతి సమయంలో జైలుకు పంపడం రైతు వర్గానికే అవ‌మానమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: గెలవకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. గెలిస్తే సీఎం రాజీనామా చేయాలి: రఘురామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.