ETV Bharat / state

RIVER: నదిలో చిక్కుకున్న యువకుడు.. రక్షించిన పోలీసులు

author img

By

Published : Nov 12, 2021, 9:37 PM IST

కడప జిల్లా కమలాపురం మండలం పాపాగ్ని నదిలో చిక్కుకున్న యువకుడిని పోలీసులు కాపాడారు. మైన్స్​లో పని చేస్తున్న యువకుడు పని ముగించుకుని తిరిగి వస్తుండగా నదిలో చిక్కుకున్నాడు.

నదిలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన పోలీసులు
తాడు సాయంతో నదిలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన పోలీసులు

నదిలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన పోలీసులు

రెండు రోజుల నుండి కురిసిన వర్షానికి కడప జిల్లా కమలాపురం మండలం పొడదుర్థి పాపాగ్ని నది ఉప్పొంగుతోంది. ఆ నది ప్రవాహంలో చిక్కుకున్న యువకుడిని పోలీసులు కాపాడారు. హబీబ్ అనే యువకుడు ఏరు అవతల ప్రక్కన మైన్స్​లో పని చేస్తున్నాడు. మైన్స్​ నుంచి తిరిగి వస్తున్న సమయంలో పాపాగ్ని నది మధ్యలో చిక్కుకున్నాడు. సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై మధుసూదన్ రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది.. తాడు సాయంతో హబీబ్​ను ఒడ్డుకు చేర్చారు.

క్షేమంగా కాపాడిన సిబ్బందికి గ్రామస్థులు, హబీబ్, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సమయానికి చేరుకొని యువకుని రక్షించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఇదీ చదవండి:

LIVE VIDEO : కాసేపైతే జలసమాధే.. వరదలో కొట్టుకుపోతున్న ముగ్గురిని కాపాడారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.