ETV Bharat / state

Penna approach road మరోసారి కొట్టుకుపోయిన పెన్నా అప్రోచ్‌ రోడ్డు

author img

By

Published : Sep 30, 2022, 1:16 PM IST

Updated : Sep 30, 2022, 3:54 PM IST

Penna approach road washed away: జమ్మలమడుగు - ముద్దనూరు పెన్నా అప్రోచ్‌ రోడ్డు.. మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి వదిలిన నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. వారం రోజుల క్రితమే తాత్కాలికంగా పెన్నాపై అప్రోచ్ రోడ్డును వేశారు. నీటి ఉద్ధృతికి రోడ్డు తెగడంతో.. జమ్మలమడుగు, ముద్దనూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Penna approach road
కొట్టుకుపోయిన పెన్నా అప్రోచ్‌ రోడ్డు


road washed away once again: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు-ముద్దనూరు పెన్నా అప్రోచ్ రోడ్డు మళ్లీ కొట్టుకుపోయింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి అధికారులు నీటి వదిలారు. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో మరో మారు అప్రోచ్​ రోడ్డు కొట్టుకుపోయింది. వారం రోజుల క్రితమే తాత్కాలికంగా పెన్నా పై అప్రోచ్ రోడ్డును వేశారు. కొద్దిరోజులుగా మైలవరం నుంచి పెన్నాకు 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. నీటి ప్రవాహానికి రోడ్డు తెగడంతో జమ్మలమడుగు, ముద్దనూరు మధ్య రాకపోకల నిలిచిపోయాయి.

కొట్టుకుపోయిన పెన్నా అప్రోచ్‌ రోడ్డు

పెన్నా చుట్టూ ఉన్న దాదాపు 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు గండికోట జలాశయంలోకి వరద నీరు చేరుతుండడంతో అక్కడినుంచి మైలవరానికి.. మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీరు విడుదల చేస్తున్నారు. మైలవరం పూర్తి సామర్థ్యం 6.5ల టీఎంసీలు కాగా ప్రస్తుతం మైలవరంలో 5.7 టీఎంసీ ల నీరు నిల్వ ఉంది. గండికోట ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 26.85 టిఎంసిలు కాగా ప్రస్తుతం గండికోటలో 26 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 30, 2022, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.