ETV Bharat / state

rayalaseema declaration: కడపలో రాయలసీమ డిక్లరేషన్‌ ప్రకటించనున్న నారా లోకేశ్...

author img

By

Published : Jun 7, 2023, 6:49 AM IST

rayalaseema declaration: నేడు రాయలసీమ డిక్లరేషన్‌పై నారా లోకేశ్ కీలక ప్రకటన చేయనున్నారు. సా.5 గం.కు కడపలో రాయలసీమ పార్టీ నేతలతో, రాయలసీమ ప్రముఖులతో 'మిషన్ రాయలసీమ'పై ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. రాయలసీమలో లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముగియనుండటంతో.. రాయలసీమ కోసం నారా లోకేశ్‌ కీలక ప్రకటన చేయనున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే సీమకు ఏం చేస్తామనే దానిపై లోకేశ్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు.

rayalaseema declaration
rayalaseema declaration

నేడు రాయలసీమ డిక్లరేషన్‌పై కీలక ప్రకటన చేయనున్న లోకేశ్‌

Rayalaseema declaration will be announced today: తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్‌... నేడు రాయలసీమ డిక్లరేషన్‌ ప్రకటించనున్నారు. రాయలసీమకు చెందిన పార్టీ ముఖ్య నేతలు, ప్రముఖులతో సమావేశమై... "మిషన్ రాయలసీమ" పేరుతో కీలక ప్రసంగం చేయనున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక సీమకు ఏం చేస్తామనే దానిపై స్పష్టత ఇవ్వనున్నారు. జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర.... ఈ నెల 11తో సీమ జిల్లాల్లో ముగియనుంది. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పాదయాత్ర సాగింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లాలో కొనసాగుతోంది.

Lokesh Padayatra: పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే టీడీపీ లక్ష్యం: నారా లోకేశ్

డిక్లరేషన్‌కు తుదిరూపు: మంగళవారానికి 118వ రోజు పాదయాత్ర పూర్తయింది. 119వ రోజైన బుధవారం పాదయాత్రకు విరామం ఇచ్చిన లోకేశ్‌... కడప కేంద్రంగా రాయలసీమ డిక్లరేషన్‌ ప్రకటించనున్నారు. కడప శివారులోని రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో సాయంత్రం 5 గంటలకు రాయలసీమ జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలు, ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశారు. 118 రోజుల పాదయాత్రలో సామాన్యులు, రైతులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు, మహిళలు, రాజకీయ నాయకులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల సమస్యలను లోకేశ్‌ తెలుసుకున్నారు. ఇప్పటికే సీమకు ఏం చేయాలనే దానిపై ఒక అవగాహనకు వచ్చిన ఆయన.... యాత్రలో తాను చూసిన, తెలుసుకున్న సమస్యలపై పార్టీ నేతలు, ప్రముఖులతో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చించి.... డిక్లరేషన్‌కు తుదిరూపు ఇవ్వనున్నారు. 2024లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక వెనుకబడిన రాయలసీమకు ఏం చేస్తామనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.

ఉద్యోగ అవకాశాల కల్పన కోసం: తాగు, సాగు నీటి పరంగా రాయలసీమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున... సాగునీటి ప్రాజెక్టుల అంశంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉద్యాన పంటలకు రాయలసీమ అనువైన ప్రాంతం. అందులోనూ ఉమ్మడి కడప జిల్లా ఉద్యాన పంటలకు మరింత ఎక్కువగా పేరొందింది. అందువల్ల ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఇక్కడి పంటలు, మొక్కలు ఎగుమతి చేసే ప్రాజెక్టు ఏర్పాటుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు తీసుకోనున్న చర్యలపై కార్యచరణ వెల్లడించనున్నారు. వలసల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. కడప శివారులోని రాజరాజేశ్వరి కళ్యాణమండపం ప్రాంగణంలో నీ విడది కేంద్రంలో నారా లోకేష్ మంగళవారం రాత్రి బస చేశారు. బుధవారం పాదయాత్రకు విరామం ప్రకటించి రాయలసీమ డిక్లరేషన్ పై సమావేశం ముగిసిన తర్వాత రాత్రి కూడా అక్కడే బస చేస్తారు.

Joinings in Telugu Desam Party : జగన్ రాక్షస పాలనను అంతమొందిస్తేనే కడప గడపల్లో స్వేచ్ఛ: నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.