ETV Bharat / state

Muslim Agitation in Kadapa: సమాధులు కూల్చొద్దు.. కడపలో ముస్లింల ఆందోళన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 10:39 PM IST

Muslim Agitation in Kadapa: రోడ్డ వెడల్పులో భాగంగా స్మశాన వాటిక ప్రహరీ గోడతో పాటు పలు సమాధులను కూడా కూల్చి వేస్తామని అధికారులు చెప్పడాన్ని నిరసిస్తూ ముస్లింలు కడపలో ఆందోళన చేపట్టారు. ఉప ముఖ్యమంత్రే ప్రాతినిధ్యం వహిస్తున్న కడపలోనే ముస్లిం సంఘాలకు సంబంధించిన ఆస్తులకు ఎటువంచి రక్షణ లేకుండా పోయిందని.. ఆయన ఒక ముస్లిం అయి ఉండి కూడా ఓ ముస్లిం స్మశాన వాటికను కూల్చివేస్తుంటే కనీసం స్పందించకపోవడం దారుణమని వారు అన్నారు.

Muslim_Agitation_in_Kadapa
Muslim_Agitation_in_Kadapa

Muslim Agitation in Kadapa: రోడ్డ వెడల్పులో భాగంగా శ్మశాన వాటిక ప్రహరీ గోడతో పాటు పలు సమాధులను కూడా కూల్చి వేస్తామని అధికారులు చెప్పడాన్ని నిరసిస్తూ ముస్లింలు కడపలో ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ముస్లిం మైనార్టీల ఓట్లతో గెలుపొంది చివరకు వారిని నిలువునా మోసం చేస్తున్నారని ముస్లిం సంఘాల నాయకులు మండిపడ్డారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రే ప్రాతినిధ్యం వహిస్తున్న కడపలోనే ముస్లిం సంఘాలకు సంబంధించిన ఆస్తులకు ఎటువంచి రక్షణ లేకుండా పోయిందని.. ఆయన ఒక ముస్లిం అయి ఉండి కూడా ఓ ముస్లిం శ్మశాన వాటికను కూల్చివేస్తుంటే కనీసం స్పందించకపోవడం దారుణమని వారు అన్నారు.

Fully Damaged Flyovers in Vijayawada: విజయవాడలో భయపెడుతున్న ఫ్లైఓవర్లు.. జగనన్న గుంతల పథకమా అంటూ సెటైర్లు

కడప నగరంలో రోడ్ల వెడల్పు కార్యక్రమంలో భాగంగా కొన్ని వందల ఏళ్ల నాటి ముస్లిం శ్మశాన వాటిక కూల్చవద్దంటూ ముస్లింలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చేయడం మంచిదే కానీ.. మతాల విశ్వాసాలను కూడా అధికారులు గౌరవించాలని ముస్లిం పెద్దలు కోరారు. ప్రస్తుతము చాలా చోట్ల రోడ్లపై పలు మతాలకు సంబంధించిన ప్రార్ధన ఆలయాలు ఉన్నాయి. వాటిని వాటి స్థానంలో అలానే ఉంచి.. వాటి పక్క నుంచి రోడ్లు వేసుకొని వెళ్తున్న సంఘటనలు చాలా ఉన్నాయని వారు పేర్కొన్నారు. కానీ కడపలో మాత్రం నగరపాలక కమిషనర్ మొండి పట్టుపట్టి ముస్లిం స్మశాన వాటిక ప్రహరీని కూల్చి వేస్తామని నోటీసులు ఇవ్వడం దారుణమని తాము ఈ చర్యను ఖండిస్తున్నాము అని వారు అన్నారు. ప్రభుత్వ అధికారులు కనుక ఈ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ముస్లింలు హెచ్చరించారు.

Muslim Agitation in Kadapa: సమాధులు కూల్చొద్దు.. కడపలో ముస్లింల ఆందోళన

CHANGES IN ROAD WIDTH: రోడ్డు వెడల్పు కుదింపునకు గ్రీన్ సిగ్నల్.. వెల్లువెత్తుతున్న వ్యతిరేకత

నగర మున్సిపల్​ కమిషనర్​ కావాలనే ఈ కూల్చివేతను ప్రోత్సహిస్తున్నారు. ప్రజా ప్రతినిదులు ఎవరు చెప్పినా ఆయన వినడం లేదు. అధికారులు చేసే పనుల వల్ల కూడా వైయస్సార్​ ప్రభుత్వానికి చెడ్డు పేరు వస్తుంది. మీకు ఓట్లు వేసి గెలిపించిన వారికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తే ప్రజలు మీకు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి బుద్ది చెప్పుతారు.- సలావుద్దీన్, ముస్లిం సంఘం నాయకుడు.

Demolition of Houses in Violation of Court Orders : రోడ్ల పక్కన నిర్మాణాలు కూల్చివేత.. కోర్టు ఆదేశాలు పట్టించుకోని అధికారులు

రోడ్డు వెడల్పులో భాగంగా ముస్లిం శ్మశాన వాటికను కూల్చివేస్తామని అధికారులు నోటీసులు ఇవ్వడం బాధాకరం. ఎక్కడైనా దర్గాలు, శ్మశానాలు ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని వదిలి వేసి పక్క నుంచి రోడ్డు వెడల్పు చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా నగర కమిషనర్​ నిర్ణయం తీసుకోవడం బాధాకరం.- నజీర్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు

Illegal constructions in Addanki: వైఎస్సార్సీపీ నేత ఫోన్..! నిలిచిపోయిన అక్రమ కట్టడాల కూల్చివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.