ETV Bharat / state

శవరాజకీయాలు జగన్​కు కొత్తకాదు: బుద్దా

author img

By

Published : Mar 15, 2019, 6:47 PM IST

శవరాజకీయాలు చేయడం వైకాపా అధినేత జగన్‌కు కొత్త కాదని... చిన్నాన్న మరణాన్ని కూడా జగన్ రాజకీయాలకు వాడుకుంటున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు.

మాట్లాడుతున్న బుద్దా వెంకన్న

శవరాజకీయాలు జగన్​కు కొత్తకాదు: బుద్దా
వివేకానందరెడ్డి మృతిపై వైకాపా అధినేత జగన్‌, ఆ పార్టీ ఎంపీ అవినాష్​రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. రక్తపుమడుగులో ఉంటే గుండెపోటుతో చనిపోయారని ఎందుకు చెప్పారన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన బుద్దా... జగన్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఘటనాస్థలంలో రక్తపు మరకలు చెరిపింది ఎవరని ప్రశ్నించారు. గతంలో మంత్రి పదవి తీసుకోవద్దని వివేకాను జగన్‌ కోరిన విషయం గుర్తుచేశారు. ''రాజకీయ సలహాదారుప్రశాంత్ కిషోర్‌ కథ అల్లాడు... జగన్ అమలు చేశాడు'' అని బుద్దా వెంకన్న ఆరోపించారు. వైఎస్ వివేకా హత్యపై జగన్‌ వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన... కడప లోక్‌సభ సీటుపై ఘర్షణలు నిజం కాదా అనినిలదీశారు.

వివేకా చనిపోయారని తెలియగానే...లోటస్‌పాండ్‌ నుంచి తెలంగాణ పోలీసులతో జగన్ మంతనాలు జరిపారని ఆరోపించారు. హత్యపైతెలంగాణ పోలీసులతోనే దర్యాప్తు చేయించే ఉద్దేశంతో జగన్ ఉన్నారని దుయ్యబట్టారు.వైఎస్ వివేకాను కుటుంబంలోని వ్యక్తే హత్య చేయించారని ఆరోపణలు వస్తున్నాయన్న బుద్దా... జగన్‌ కుటుంబంతో తప్ప వివేకానందరెడ్డికి ఎవరితో గొడవలు లేవని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్యపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. హత్య చేసి సానుభూతి సంపాదించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సొంత చిన్నాన్న చనిపోతే... జగన్ తాపీగా లోటస్‌పాండ్‌లోనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో వైఎస్‌ చనిపోయినప్పుడూ జగన్ఇలాగే చేశారన్న బుద్దా... ఎన్నికల్లో సానుభూతి కోసం ప్రతిపక్ష నేత ఏమైనా చేస్తారన్నారు.చంద్రబాబు పాలనలో కడప జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలు ఆగిపోయిన విషయం గుర్తుచేశారు.

RESTRICTION SUMMARY: NO ACCESS NORWAY
SHOTLIST:
NRK - NO ACCESS NORWAY
ARCHIVE - Skien - 18 January 2017
1. Anders Behring Breivik walks into court during trial on his prison conditions, shakes hands with officials
STORYLINE:
The manifesto that the presumed New Zealand shooter published is shorter than the one written by a Norwegian right-wing extremist who killed 77 people in 2011, but expresses similar sentiments, according to a Swedish terror expert.
Anders Behring Breivik posted his 1,500-page manifesto online before carrying out his deadly attacks in Norway.
The New Zealand shooter, who killed at least 49 people in two mosques in Christchurch on Friday, claimed to have been in contact with Breivik's sympathisers.
On July 22, 2011, Breivik killed eight people with a car bomb in Oslo and then opened fire at an island summer camp run by the left-wing Labor Party's youth wing, killing 69. He is serving a 21-year prison sentence.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.