ETV Bharat / state

కొట్టుకుపోయిన రెండు కాజ్​వేలు... ఇబ్బందుల్లో వాహనదారులు

author img

By

Published : Dec 5, 2020, 7:18 PM IST

తుపాను కారణంగా కడప జిల్లాలోని బుగ్గవంకపై నిర్మించిన రెండు కాజ్​వేలు కొట్టుకుపోయాయి. దీంతో రవీంద్ర నగర్ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

kajway has washed away constructed on buggavanka dam in kadapa district
కొట్టుకుపోయిన రెండు కాజ్​వేలు... ఇబ్బందుల్లో వాహనదారులు

పది రోజుల కిందట కడప నగరాన్ని అతలాకుతలం చేసిన వరదలు... ప్రజలను వివిధ రూపాల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కడప నగర నడిబొడ్డున ప్రవహిస్తున్న బుగ్గవంకపై నిర్మించిన రెండు కాజ్ వేలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో రవీంద్ర నగర్ వాసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రవీంద్ర నగర్, గుర్రాల గడ్డ, నబీ కోట, మరియాపురం మరాఠీ వీధి, మురాద్ నగర్ తదితర ప్రాంతాల ప్రజలు కడప నగరంలోకి వెళ్లాలంటే ఈ రెండు కాజ్​వేల పైనుంచే ప్రయాణించేవారు. తుపాను కారణంగా కురిసిన అధిక వర్షాలకు ఆ రెండు కాజ్ వేలు కొట్టుకుపోవడంతో... స్థానికులు వేరే వైపు నుంచి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.


ఇదీ చదవండి:

నిండుకుండలా కల్యాణి డ్యామ్​.. జలహారతి ఇచ్చిన చెవిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.