ETV Bharat / state

బురద ట్రాక్​లో బండి నడిపితేనే డ్రైవింగ్ లైసెన్స్​

author img

By

Published : Nov 21, 2020, 10:11 AM IST

కడపలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో ఉన్న డ్రైవింగ్ ట్రాక్ పరిస్థితి దారుణంగా మారింది. గుంతలు పడి.. చూట్టూ గడ్డి మొలిచి అద్ధ్వాన్నంగా తయారైంది. ట్రాక్ పరిస్థితి చూసి పరీక్షకు వచ్చే వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతు చేయాలని కోరుతున్నారు.

kadapa driving track in bad condition
అద్వానంగా కడప డ్రైవింగ్ ట్రాక్

కడపలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో ఉన్న డ్రైవింగ్ ట్రాక్ పంట పొలాన్నితలపిస్తోంది. ఎగుడు దిగుడు.. మట్టి రోడ్డు.. చుట్టూ గడ్డి.. చూసేందుకు ఇది డ్రైవింగ్ ట్రాకా అనే అనుమానం కలుగుతోంది. ఏళ్ల తరబడి నుంచి ఇదే ట్రాక్​పై వాహనదారులకు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వర్షాకాలం వస్తే పరిస్థితి చెప్పనక్కర్లేదు. ట్రాక్ మొత్తం బురదగా మారుతుంది, పెద్ద పెద్ద గుంతలు ఏర్పడతాయి. ఇటీవల కురిసిన వర్షానికి ట్రాక్ మొత్తం పాడైపోయింది. వాహనదారులు నానా అగచాట్లు పడుతున్నారు. కానీ అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అత్యాధునికమైన డ్రైవింగ్ ట్రాక్​ ఏర్పాటు చేస్తున్నారు. కానీ జిల్లా కేంద్రంలో మాత్రం డ్రైవింగ్ ట్రాక్ పరిస్థితి దారుణంగా మారింది. రోజుకు 50 నుంచి 70 మంది వరకు వివిధ రకాల డ్రైవింగ్ పరీక్షలకు వస్తుంటారు. వీరందరూ ఈ ట్రాక్​ చూసి భయపడుతున్నారు. పొరపాటున ఏదైనా జరిగితే అధికారులు ఫెయిల్ చేస్తారనే భయం వాహనదారుల్లో నెలకొంది.

ఇదీ చదవండి: ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.