ETV Bharat / state

కడపలో హజ్ హౌజ్ ప్రారంభం

author img

By

Published : Mar 6, 2019, 10:58 PM IST

కడప జిల్లాలోని చెన్నూరు వద్ద 27 కోట్ల రూపాయలతో నిర్మించిన హజ్ హౌస్​ను మంత్రులు ఆదినారాయణరెడ్డి, ఫరూక్, మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రారంభించారు.

కడపలో హజ్ హౌస్ ప్రారంభం

కడపలోని చెన్నూరు వద్ద హజ్ హౌస్ ప్రారంభం
కడప జిల్లాలోని చెన్నూరు వద్ద హజ్ హౌజ్ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ అన్నారు. 27 కోట్ల రూపాయలతో నిర్మించిన హజ్ హౌస్​ను మంత్రులు ఆదినారాయణరెడ్డి, ఫరూక్, మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రారంభించారు. ఒకేసారి 450 మంది కూర్చునే విధంగా వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. హజ్ హౌస్ నిర్వహణ బాధ్యతలు జిల్లా కలెక్టర్ తీసుకోవాలని మంత్రి ఫరూక్ సూచించారు. ఇక్కడే షాదీఖానా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. కడప విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు వెళ్లడానికి విమాన సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం చెన్నూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
New Delhi, Mar 06 (ANI): Pakistan Supreme Court reinstated ban on airing Indian content on local television. The hearing of the case was taken up by three bench members of the apex court, which was headed over by Justice Gulzar Ahmed. He even asked the localities if they still want to watch Indian shows. Justice Ijaz-ul Ahsan of the High Court also they are not authorized to interfere in Pakistan Electronic Media Regulatory Authority (PEMRA) powers. After India banned Pakistani content and artists, Pakistan also imposed the ban.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.