ETV Bharat / state

వినాయక నిమజ్జనంలో అపశృతి... వాటర్‌గండిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

author img

By

Published : Sep 12, 2021, 5:35 PM IST

Updated : Sep 12, 2021, 7:34 PM IST

ఇద్దరు విద్యార్థులు గల్లంతు
ఇద్దరు విద్యార్థులు గల్లంతు

17:33 September 12

CDP_Ganesh immersion_Two Students Missing_Breaking

కడప వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు పెన్నానదిలో గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు, అగ్నిమాపక శాఖ గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలోని రవీంద్రనగర్​కు చెందిన చైతన్య, శ్రీనాథ్ ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వీరితో పాటు మరి కొంతమంది యువత వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కడప శివారులోని వాటర్ గండికి వెళ్లారు. 

వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయంలో చైతన్య, శ్రీనాథ్​లు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు. మరొక యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. గల్లంతైన వారి కోసం పోలీసులు అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పిల్లల కోసం కన్నీరుమున్నీరుగా విలపించారు.  

ఇదీ చదవండి:

సెల్ఫీ వీడియో ఘటన...రాజీతో సద్దుమణిగిన వివాదం

Last Updated : Sep 12, 2021, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.