ETV Bharat / state

సతీష్​రెడ్డి నిర్ణయమేంటి..? అభిమానుల్లో ఉత్కంఠ

author img

By

Published : Jun 8, 2022, 4:38 PM IST

Kadapa News: శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్​ సతీష్ రెడ్డి రాజకీయ నిర్ణయంపై అనిశ్చితి నెలకొంది. తెదేపాలోకి రావాలంటూ.. ఆయన అనుచరులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయంగా ఏం నిర్ణయం తీసుకుంటారో అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

kadapa tdp leaders
kadapa tdp leaders

Pulivendula politics: శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్​ సతీష్ రెడ్డి.. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి వైఎస్​ఆర్​(కడప) జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తెదేపాలోకి రావాలంటూ ఆయన అనుచరులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పులివెందుల నియోజకవర్గంలోని తెదేపా ముఖ్యనాయకులు.. వేంపల్లెలోని సతీశ్​రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. సతీశ్​ రెడ్డి ముఖ్య అనుచరులు భారీగా రావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆయనతో నేతలు చర్చలు జరిపారు. అనుచరులు ఒత్తిడి చేసినప్పటికీ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. అయితే.. సతీశ్​రెడ్డి రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.