ETV Bharat / state

"బద్వేలు ఉప ఎన్నికపై అభ్యంతరాలుంటే.. నాకు ఫిర్యాదు చేయండి"

author img

By

Published : Oct 13, 2021, 7:56 PM IST

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ అక్టోబర్ 30న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఎన్నికల పరిశీలన అధికారి భీష్మకుమార్ బద్వేలుకు చేరుకున్నారు.

election
election

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక పరిశీలకులు భీష్మ కుమార్ జిల్లాకు చేరుకున్నారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో భీష్మకుమార్.. బద్వేలుకు చేరుకున్నారు. ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి సమస్యలు, ఫిర్యాదులు ఏవైనా ఉంటే.. తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఎన్నిక సజావుగా సాగేందుకు ప్రజాప్రతినిధులు, ఓటర్లు సహకరించాలని కోరారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన.. రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్​ ను అడిగి బద్వేలు ఉప ఎన్నికల ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం.. ఎన్నికల కౌంటింగ్ కేంద్రమైన బద్వేలు బలయోగి బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. స్ట్రాంగ్ రూమ్​ను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండి: Badvel Bypoll 2021: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు.. బరిలో 15 మంది అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.