ETV Bharat / state

రవాణా శాఖ కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల కొరత

author img

By

Published : Sep 30, 2020, 2:34 PM IST

రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల కొరత ఏర్పడింది. కార్డుల ముద్రణ నిలిపివేయటంతో కొరత ఏర్పడినట్లు అధికారులు చెప్తున్నారు. కడప జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేల కార్డులు పెండింగ్​లో ఉన్నాయి.

driving licence cards scaricity in ap state wise
రవాణా శాఖ కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల కొరత

కడప జిల్లా పరిధిలోని 6 రవాణా శాఖ కార్యాలయాల్లో గత నెలరోజుల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల కొరత ఏర్పడింది. రాష్ట్రస్థాయిలో ముద్రణ నిలిపివేయటంతో డ్రైవింగ్ కార్డుల సరఫరా ఆగిపోయింది. దీంతో జిల్లావ్యాప్తంగా వాహనదారులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కార్డులు ఎప్పుడు వస్తాయో అధికారులకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం పరీక్షలు నిర్వహించిన అనంతరం అదే రోజు సాయంత్రం పాసైన అభ్యర్థులకు డ్రైవింగ్ లైసెన్స్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తారు. కానీ ఆగస్టు 26 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు లేవు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. డ్రైవింగ్ పరీక్ష పాస్ అయిన అభ్యర్థులకు కార్డుల రూపంలో కాకుండా పేపర్ రూపంలో లైసెన్స్​లు అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేల కార్డులు పెండింగ్​లో ఉన్నాయి. కార్డులు సాధ్యమైనంత తొందరగా మంజూరు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

ఇవీ చదవండి..

శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తి నీరు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.