ETV Bharat / state

Foundation for Oberoi Hotel: ఒబెరాయ్ హోటల్ రాకతో.. గండికోటకు ప్రపంచ స్థాయి గుర్తింపు: సీఎం జగన్

author img

By

Published : Jul 9, 2023, 1:19 PM IST

Updated : Jul 9, 2023, 10:52 PM IST

గండికోటకు ప్రపంచ స్థాయి గుర్తింపు: సీఎం జగన్
గండికోటకు ప్రపంచ స్థాయి గుర్తింపు: సీఎం జగన్

Foundation for Oberoi Hotel: ఒబెరాయ్ హోటల్ నిర్మాణంలో గండికోట ప్రాంతం ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. 50 ఎకరాల్లో 250 కోట్ల రూపాయలతో ఇక్కడ సెవెన్ స్టార్ హోటల్ నిర్మించనున్నారు.

Foundation for Oberoi Hotel: గ్రాండ్ కానియన్ ఆఫ్ ఇండియా గా పిలుచుకునే గండికోటను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఓబెరాయ్ సంస్థ ఆధ్వర్యంలో గండికోట, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి గండికోట కేంద్రంగా సీఎం జగన్ వర్చువల్ గా భూమి పూజ చేశారు. పులివెందుల పట్టణంలో కూడా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు.

వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేశారు. 50 ఎకరాల్లో 250 కోట్ల రూపాయలతో నిర్మించే సెవెన్ స్టార్ హోటల్ ను నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఒబెరాయ్ గ్రూప్స్ ఎండి విక్రమ్ సమక్షంలో గండికోట, తిరుపతి, విశాఖపట్నం మూడు ప్రాంతాల్లో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి గండికోట నుంచే శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఒబెరాయ్ లాంటి సంస్థలు ఇక్కడికి రావడం చాలా సంతోషమని ఇక్కడ హోటల్ నిర్మిస్తే మరిన్ని పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో వస్తాయని సీఎం అన్నారు. జమ్మలమడుగు ప్రాంత వాసులు కూడా ఇక్కడ జరిగే అభివృద్ధి కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఒబెరాయ్ సంస్థ గండికోటలో గోల్ఫ్ కోట్లు కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సీఎం పేర్కొన్నారు. సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. రేపు కొప్పర్తి లో కూడా డిక్షన్ కంపెనీకి సంబంధించిన మరో యూనిట్ను ప్రారంభించి మరికొన్ని పరిశ్రమలకు ఒప్పందం చేసుకుంటున్నామని సీఎం తెలిపారు. గండికోటలో వ్యూ పాయింట్ లు కూడా పరిశీలించారు. పెన్నా నది లోయలో బోటు షికారు ను సీఎం పరిశీలించారు. ఒబెరాయ్ హోటల్ నిర్మాణం చేపడితే దాదాపు 1000 మందికి ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం ఆకాంక్షించారు. విశాఖపట్నంలో చేసుకున్న ఒప్పందం మేరకు గండికోటలో హోటల్ చేపట్టేందుకు ముందుకు వచ్చామని గ్రూపు సంస్థ ఎండి విక్రమ్ అన్నారు.

గండికోట కార్యక్రమం ముగించుకున్న తర్వాత సీఎం జగన్ హెలికాప్టర్లో పులివెందుల చేరుకున్నారు. పులివెందుల నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు అనంతరం కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించి ఇష్టా గోష్టిగా మాట్లాడారు. పులివెందుల నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. గతంలో నాన్న చేసిన అభివృద్ధి తర్వాత పులివెందులను ఎవరూ పట్టించుకోలేదని... ఇప్పుడు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ పులివెందులలో అభివృద్ధి పరుగులు పెడుతుందని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రం తో పాటు దేశం మొత్తం పులివెందుల వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అందరి సహకారం ఉంటే భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి నిధులు తీసుకొస్తానని సీఎం హామీ ఇచ్చారు. పులివెందుల నియోజకవర్గంలో ఐఎండి కింద లేఅవుట్ల ప్రక్రియ సాగుతున్న క్రమంలో వాటి ద్వారా వచ్చే వంద కోట్ల రూపాయలను మున్సిపాలిటీ దక్కే విధంగా బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేసి వాటి ద్వారా వచ్చే వడ్డీతో మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

అనంతరం స్కిల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్, వైయస్సార్ స్పోర్ట్స్ అకాడమీ సీఎం జగన్ ప్రారంభించారు. పులివెందులలో గరండాల కాల్వ మొదటి దేశ పనులను ప్రారంభించారు. న్యూ బయోటెక్ సైన్స్ తో పాటు ఏపీ కార్ల లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. సాయంత్రం పులివెందుల నుంచి ఇడుపులపాకు చేరుకున్న సీఎం కేయంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కాసేపు సమావేశమై తాజా పరిస్థితి పైన చర్చించారు. రాత్రికి ఇడుపులపాయలోనే సీఎం బస చేస్తారు.

గండికోటకు ప్రపంచ స్థాయి గుర్తింపు: సీఎం జగన్
Last Updated :Jul 9, 2023, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.