ETV Bharat / state

'చెయ్యాలి చెల్లికి పెళ్లి.. మళ్లీ మళ్లీ' సినిమా డైలాగ్‌ను జగన్‌ పాటిస్తున్నారు: సత్యకుమార్​

author img

By

Published : Feb 15, 2023, 7:13 PM IST

BJP SATYAKUMAR FIRES ON CM JAGAN : యువతను మళ్లీ మోసం చేయడానికే జగన్​ మరోసారి కడప స్టీల్​ ప్లాంట్​కు భూమి పూజ చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్​ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్ల కోసమే ఈ డ్రామాకు తెర తీశారని ఆరోపించారు.

BJP SATYAKUMAR FIRES ON CM JAGAN
BJP SATYAKUMAR FIRES ON CM JAGAN

BJP SATYAKUMAR FIRES ON CM JAGAN : నెల రోజుల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్ల కోసమే సీఎం జగన్‌.. కడప ఉక్కు కర్మాగారానికి రెండోసారి భూమి పూజ చేసి సరికొత్త డ్రామాకు తెరతీశారని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌ విమర్శించారు. భూమిపూజ పేరుతో.. మళ్లీ నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించి.. ఓట్లు కొల్లగొట్టడానికే ఈ విధంగా చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కడపలో జిందాల్‌ ఉక్కు కర్మాగారానికి జగన్‌ భూమి పూజ చేయడంపై ఆయన స్పందించారు. ఓ సినిమాలో ‘చెయ్యాలి చెల్లికి పెళ్లి.. మళ్లీ మళ్లీ’ అని ఓ డైలాగు ఉందని.. సీఎం జగన్‌ ఆ డైలాగ్​ను స్ఫూర్తిగా తీసుకుని రెండోసారి ‘కడప స్టీలు ప్లాంట్’కు భూమి పూజ చేశారని ఎద్దేవా చేస్తూ.. సత్యకుమార్‌ వ్యంగంగా ట్వీట్‌ చేశారు. గతంలో వైఎస్సార్ ఒకసారి, చంద్రబాబు ఒకసారి.. జగన్​ మోహన్​రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక మూడో సారి భూమి పూజ చేశారని అన్నారు.

సీమ యువతకు ‘మళ్లీ మళ్లీ మోసం’ జరుగుతూనే ఉందన్న ఆయన.. నెల రోజుల్లో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్ల కోసం ఆడుతున్నదే ఈ సరికొత్త డ్రామానే అని విమర్శించారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెయ్యడం, నమ్మించి నయవంచనకు పాల్పడడం జగన్నాటకంలో భాగమన్నారు. సీమ యువతా..! మళ్లీ మళ్లీ మోసపోదామా? అని ప్రశ్నించారు.

  • మళ్ళీ నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించి, నెల రోజుల్లో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్ల కోసం ఆడుతున్న సరికొత్త డ్రామానే జగనన్న చేస్తున్న ఈ మూడో పెళ్లి.

    ఏరు దాటింతర్వాత తెప్ప తగలెయ్యడం, నమ్మించి నయవంచనకు పాల్పడడం జగన్నాటకంలో భాగం!

    సీమ యువతా!
    మళ్ళీ మళ్ళీ మోసపోదామా? https://t.co/zv7ha2FRPQ

    — Y. Satya Kumar (సత్యకుమార్) (@satyakumar_y) February 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వైయస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్​డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు. జేఎస్​డబ్ల్యూ స్టీల్ ప్లాంట్​ ఛైర్మన్ సజ్జన్​ జిందాల్​తో కలిసి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకముందు 2007లో వైఎస్సార్​ రాజశేఖర్​ రెడ్డి శంకుస్థాపన చేయగా.. 2018లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు భూమిపూజ చేశారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 డిసెంబర్​ 23న జగన్​ భూమిపూజ చేయగా.. నేడు మరోసారి అదే ప్రాంతంలో జేఎస్​డబ్ల్యూ కంపెనీతో కలిసి శంకుస్థాపన చేయడం గమనార్హం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.