ETV Bharat / state

'పొగాకు ధరల్లో మార్పు రాకుంటే పంట విరామం తప్పదు'

author img

By

Published : Jun 25, 2020, 9:51 PM IST

పొగాకు ధరల్లో మార్పు రాకుంటే వచ్చే ఏడాది పంట విరామాన్ని ప్రకటిస్తామని పొగాకు రైతులు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రంలో రైతు సంఘం నేతలు సమావేశమయ్యారు. పండిన పంటలో రసాయనాల అవశేషాల శాతం ఎక్కువ ఉందంటూ పొగాకు బోర్డు అధికారులు చెప్పడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'పొగాకు ధరల్లో మార్పు రాకుంటే పంట విరామం తప్పదు'
'పొగాకు ధరల్లో మార్పు రాకుంటే పంట విరామం తప్పదు'

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో 5 పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 14 వేల మంది రైతులు ఉండగా.. సుమారు 22 వేల హెక్టార్లు పొగాకు పంటలు పండిస్తున్నారు. గత నాలుగేళ్లుగా సాగులో వరుస నష్టాలు చవి చూస్తున్న పొగాకు రైతులకు.. మరో పిడుగు లాంటి ప్రమాదం వచ్చిపడింది. పండిన పంటలో పురుగు మందుల అవశేషాలు శాతం ఎక్కువగా ఉందంటూ అటువంటి పంటను అన్ని చోట్ల ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామని బోర్డు అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా సమయం కావడంతో పొగాకు ధర అమాంతంగా పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది సాగు చివరకి అప్పులే మిగులుతున్నాయని వాపోతున్నారు. కొత్తగా ఇప్పుడు అవశేషాలు పేరుతో పొగాకు కొనుగోలు నిలుపుదల చేయడం సరికాదన్నారు. జిల్లాలో సుమారు రెండు వేలమంది రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు.

బోర్డు అధికారులు, సీటీఆర్​ఐ శాస్త్రవేత్తలు సూచించిన మేరకే రసాయన మందులను పిచికారి చేశామన్నారు. పొగాకు వేలం సగం ముగిశాక... పంటల అవశేషాలు ఏడు శాతం మించాయి అని జిల్లాలో పలు క్లస్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై స్పందించాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు వినతి పత్రం అందించినట్లు పొగాకు రైతులు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పొగాకు రైతుల ఆదుకో పోతే వచ్చే ఏడాది పంట విరామాన్ని ప్రకటిస్తామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.