ETV Bharat / state

VIRAL VIDEO : పొగలు కక్కిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికుల బెంబేలు!

author img

By

Published : Nov 12, 2021, 11:56 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆర్టీసీ బస్సులో భారీగా పొగలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే ఆపేసి.. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దింపేశాడు.

short-circuit-in-rtc-bus-at-dhavaleswaram
ఆర్టీసీ బస్సులో పొగలు.. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు!

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో ఆర్టీసీ ప్రమాదానికి గురైంది. కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా.. ధవళేశ్వరం వంతనపై విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్ జరిగింది. దీంతో.. ఒక్కసారిగా పెద్దఎత్తున పొగలు వచ్చాయి. పొగలు బస్సు మొత్తాన్నీ కమ్మేశాయి. దీంతో.. డ్రైవర్ వంతెనపైనే బస్సును అర్ధంతరంగా ఆపేసి, ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు.

ఆర్టీసీ బస్సులో పొగలు.. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు!

ఇదీ చూడండి: LIVE VIDEO : కాసేపైతే జలసమాధే.. వరదలో కొట్టుకుపోతున్న ముగ్గురిని కాపాడారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.